జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం గడిచిపోయింది. అయితే ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కావలసిన ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తూ జీవోలను జారీచేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే రోజే వృద్ధాప్య పింఛన్లు 2250 కి పెంచుతున్నట్లు మొదటి సంతకం చేసిన సంగతి అందరికీ విదితమే. ఇవే కాకుండా ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన నవరత్నాలు కూడా అమలు చేస్తానని ఆరోజు గట్టిగా హామీ ఇచ్చారు.

 

 

ఇకపోతే జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మొదటగా నవరత్నాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ నేపథ్యంలో జగన్ సర్కారు చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అన్న జాతీయ మీడియా ప్రశ్నకు జగన్ కు అనుకూలంగా ఏకంగా 60 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. ఇక మిగిలిన 40 శాతం మంది వ్యతిరేకంగా ఆయనకు తీర్పునిచ్చారు. దాదాపు 75% శాతం ఓట్లతో గెలిచిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 60 శాతం మంది మాత్రమే ఆయన వైపు నిలిచారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. 

 


ఇకపోతే జగన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు మాత్రం అనేక ఉద్యోగాలను విడుదల చేసి నియమించారు. దీంతో ఒకింత నిరుద్యోగుల నుంచి జగన్ సర్కార్ కు మద్దతు లభించింది అని చెప్పవచ్చు. అలాగే గ్రామ వాలంటీర్ ల ద్వారా అన్ని సదుపాయాలు ఇంటి దగ్గరికి తెచ్చి ఇచ్చే కార్యక్రమం నిజంగా ఆయనకు చాలా కలిసి వచ్చింది. ఇక తాజాగా స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ తో జరిగిన వివాదం రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకతను కూడగట్టుకుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: