రోజురోజుకి దేశంలో దారుణాలు ఎక్కువైపోతున్నాయి. హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు ఇలా చాలా రకాలుగా ఇన్నాళ్ళు దారుణాలు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మూగ జీవాలపై కూడా దుర్మార్గులు వారినే నీచత్వాన్ని కొనసాగిస్తున్నారు. అన్నెం పున్నెం ఎరుగని ముగా జీవులపై వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. కొందరు సొంత లాభం కోసం వాడిని చంపుతున్నారు. అలాగే కొందరు వారి ఆనందం, పైశాచికత్వం కోసం చంపుతున్నారు.

 


మొన్నటికి మొన్న కేరళ రాష్ట్రంలో జరిగిన ఓ ఏనుగు అమానుషమైన దారుణ సంఘటన మరవకముందే దేశంలో మరి కొన్ని అమానుష సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అస్సాం రాష్ట్రంలోని ఖాజాపూర్ జిల్లాలోని ఓ రిజర్వాయర్లో దాదాపు పదికి పైగా కోతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనితో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కలకలం సృష్టించాయి. కేవలం అక్కడ ఉన్న నీటిని కలుషితం చేయడానికి మాత్రమే ఆ మూగజీవాలను అక్కడికి తీసుకువచ్చి బలి చేసారని స్థానికులు కొందరు ఈ సంఘటన పై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కూడా జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన పొలంలో కి అడవి జంతువులు రాకుండా ఉండటానికి విషం పూసిన పనస పండ్లను చేలో ఉంచగా వాటిని మూడు ఆవులు తిని అక్కడికక్కడే మృతి వాత పడ్డాయి.

 

జిల్లాలోని బాసవరళ్లి గ్రామానికి చెందిన కొట్టే గౌడ మధు అని ఇద్దరి వ్యక్తుల కు చెందిన మూడు ఆవులు ఆ విషపు ఆహారం తిని అక్కడికక్కడే మృతి చెందాయి. నిజానికి అవి పొలంలోకి ఎలాంటి అడవి జంతువులు రాకుండా ఆపడం కోసమే అక్కడ విషయం పూసి పెట్టినట్లు తెలుస్తోంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ ఆవులు ఆహారం తినడంతో అవి అక్కడికక్కడే మరణించాయి. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: