ఏదో ఒక విషయంపై కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఎప్పుడైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారో అప్పటి నుంచి చిరంజీవి అంశం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా ఏపీ సీఎం జగన్ ను చిరంజీవి ఆధ్వర్యంలో ని 20 మంది బృందం తెలుగు సినిమా మా ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్యలు, ఏపీలో షూటింగులు చేసుకునేందుకు అనుమతుల కోసం, అలాగే విశాఖ లో స్టూడియోల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు వీరంతా కలిశారు. ఆ సందర్భంగా అమరావతిలో రాజధాని రైతుల పేరిట కొంతమంది ప్ల కార్డ్స్ పట్టుకుని చిరంజీవికి నిరసనలు తెలిపారు. అలాగే రాజధాని వ్యవహారంపై స్పందించాలని చిరంజీవి బృందం ఉన్న గెస్ట్ హౌస్ నిరసనలు తెలియజేశారు . 
 
IHG's flag design Explained Shatchakra | 25CineFrames
 
 చిరంజీవి అవేమీ పట్టించుకోకుండా  జగన్ ను కలవడం, ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లి పోవడం జరిగాయి. ఆ తర్వాత నుంచి టిడిపి బిజెపి శ్రేణులతో పాటు టీడీపీ అనుకూల మీడియా కూడా చిరంజీవి పై పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది. చిరంజీవి కేవలం స్టూడియో భూములకు సంబంధించి మాత్రమే జగన్ ను కలిశారని, ఆయనకు అమరావతి రైతుల బాధలు పట్టడంలేదని, ఇలా అనేక విమర్శలు చేశారు.గతంలో ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటన చేయగా, దానిని చిరంజీవి సమర్థించారు. మూడు రాజధానుల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందుతుందని, ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా జగన్ చిరంజీవి కలవడంపై ఈ విధంగా ఆయన పై వ్యతిరేకంగా విమర్శలు చేసినట్లుగా అర్థమవుతోంది. 
 
 
ఈ విషయంపై చిరంజీవి సోదరుడు నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాజాగా జనసేన నాయకుడు చిరంజీవి పై కుల వివక్ష చూపిస్తున్నారని వ్యాఖ్యానించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు చిరంజీవి సంబంధించిన ఏ విషయంలోనూ జనసేన బహిరంగంగా స్పందించలేదు. అలాగే జనసేనకు సంబంధించిన ఏ విషయం పైన చిరంజీవి కూడా స్పందించలేదు. అకస్మాత్తుగా చిరంజీవి పై కుల వివక్ష చూపిస్తున్నారని టిడిపి, బిజెపి శ్రేణులను  ఉద్దేశించి జనసేన నాయకుడు బొలిశెట్టి సత్య వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. చిరంజీవిపై అకారణంగా కుల వివక్ష చూపిస్తున్నారని, చిరంజీవి సిఎం ను కలిస్తే కేవలం స్టూడియో స్థలం కోసమే ఆయన కలిశారు అంటూ టిడిపి దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండి పడ్డారు.
 
 
గతంలో స్టూడియోలో భూముల కోసం ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, రామానాయుడు వంటి వారు ముఖ్యమంత్రులను కలవలేదా ? అప్పుడు కూడా భజన చేశారా అంటూ సత్య నిలదీశారు. కేవలం ఒక్క చిరంజీవిని టార్గెట్ చేసుకుని ఈ విధంగా కుల వివక్ష చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ విషయంలోనూ చిరంజీవి వ్యవహారం స్పందించిన జనసేన ఇప్పుడు స్పందించడం వెనుక కారణాలు ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: