ఇటీవల టాలీవుడ్ సినిమా పెద్దలు అమరావతి వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాలంటూ కొన్ని విజ్ఞాపనలు చేశారు. విశాఖలో భూములు ఇస్తే స్టూడియోలు కడతామన్నారు. ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కోరికలేవో కోరారు. ఇందులో తప్పేముంది.. కానీ పాపం.. ఇన్నాళ్లూ టాలీవుడ్ అంతా టీడీపీ వెనకాలే తిరగడం చూసి ఆనందించిన ఆంధ్రజ్యోతి ఆర్కే.. ఇప్పుడు వాళ్లు జగన్ ను కలవడం కూడా సహించలేకపోతున్నారు.

 

IHG's Next Target <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA JYOTHI' target='_blank' title='abn-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>abn</a> Andhrajyothi Vemuri Radhakrishna?

 

ఆర్కే ఏం రాశారు.. అసలు కథేంటో చూద్దామా..

 

ఆర్కే మాట: “ తెలుగు ప్రజలు కరోనా వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతుంటే చిరంజీవి నేతృత్వంలోని కొంతమంది సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి తమకు విశాఖలో స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించడంతోపాటు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని కోరడం ఎబ్బెట్టుగా లేదా?”

 

కామెంట్ : తెలుగు ప్రజల కరోనా కష్టాలకూ సినిమా వాళ్లకూ ఏంటి సంబంధం వాళ్లు కూడా కరోనా సమయంలో సినీ పరిశ్రమ కష్టాల గురించే వెళ్లారు కదా.

 

ఆర్కే మాట: “ దశాబ్దం క్రితమే విశాఖలో దివంగత రామానాయుడు నిర్మించిన స్టూడియో ఇప్పటికీ ఈగలు తోలుకుంటోంది. కరోనా కారణంగా మున్ముందు సినిమాల భవిష్యత్‌ ఏమిటో తెలియని స్థితిలో భూములు అడగటం ఎలా సమర్థనీయం? “

 

IHG

కామెంట్ : రామానాయుడు స్టూడియో కట్టినప్పుడు విశాఖ ఏపీ రాజధాని కాదు కదా.. ఇప్పుడు రాజధాని కాబోతోంది కదా. అందుకే అడిగారు తప్పేముంది.. అయినా కరోనా ఉందని ఇక భవిష్యత్ గురించే ఆలోచించకూడదా ఆర్కే గారూ..

 

 

ఆర్కే మాట: “ విశాఖలో ఇళ్ల స్థలాలు కావాలనుకుంటున్నవారు హైదరాబాద్‌ వదిలి విశాఖలో ఇళ్లు కట్టుకుని స్థిరపడతామని చెప్పగలరా? జగన్మోహన్‌రెడ్డిని కలిసినవారందరికీ హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన భవంతులు ఉన్నాయి. “

 

కామెంట్ : స్థిర నివాసం ఉంటేనే ఇళ్లు కట్టుకోవాలా.. ఇప్పటికీ చెన్నైలోనూ.. హైదరాబాద్‌లోనూ ఇళ్లు ఉన్న సినీ పరిశ్రమ పెద్దలు లేరా.. ఒకచోట భూములు ఉంటే.. ఇంకోచోట భూములు ఇవ్వరా.. అయినా స్థలాలు కేవలం ఇళ్లు కట్టుకోవడానికే పనికొస్తాయా.. పరిశ్రమకు కావలసిన మౌలిక సదుపాయాల కోసం స్థలాలు వద్దా..?

 

ఆర్కే మాట: “ మట్టిలో మాణిక్యాలు వంటి అద్భుత నటులతో షార్ట్‌ ఫిల్మ్‌లు తీస్తున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీలతో తెర మీద అలరిస్తున్న హీరోలకు మున్ముందు ఆదరణ ఉండకపోవచ్చు. “

 

కామెంట్ : షార్టు ఫిల్మ్‌ ఎంత బావున్నా.. షార్ట్ ఫిల్మే తప్ప సినిమా కాదు కదా ఆర్కేజీ.. ప్లాస్టిక్ సర్జరీల హీరోలకు ఆదరణ ఉండకపోవచ్చన్నది మీ శాపమా.. పాపం.. వాళ్లేం పాపం చేశారండీ..

 

ఆర్కే మాట: “ హైదరాబాద్‌లో ఉన్న స్టూడియోలే షూటింగులు లేక వెలవెలబోతున్నాయి. ఇక విశాఖలో స్టూడియోల అవసరం ఉంటుందా? “

 

కామెంట్ : కరోనా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతుందని అనుకుంటున్నారా ఆర్కే.. కరోనా సమయంలో పేపర్ చదవడం లేదని.. ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ఆపేస్తారా ఆర్కే.. లేదుగా.. వాళ్లూ అంతే..

 

IHG

ఆర్కే మాట: “ ఇంతోటి దానికి అమరావతి వెళ్లి రైతులను కూడా కలవడానికి ఇష్టపడకుండా ముఖ్యమంత్రిని మాత్రమే కలిసి కోర్కెల చిట్టా ఇవ్వడాన్ని సదరు ప్రముఖులు ఎలా సమర్థించుకుంటారు? “

 

కామెంట్ : ఇది మరీ విడ్డూరం.. అమరావతికీ సినిమా ఇండస్ట్రీకి సంబంధమేంటడీ బాబూ.. అమరావతి వెళ్లిన ప్రతివాళ్లూ రైతులను కలవాలా.. అయినా మీ పిచ్చిగానీ.. అమరావతి వెళ్లి రైతులను కలిశాక.. ఇక జగన్సినిమా వాళ్లను తన ఆఫీసు గడప తొక్కనిస్తాడా.. ఆ విషయం మీకు కూడా తెలుసుగా ఆర్కే..

 

 

ఆర్కే మాట: “ సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండిన దాసరి నారాయణరావు ఏ ముఖ్యమంత్రిని కలవకుండానే సినీ రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన బడుగుల పక్షాన నిలబడ్డారు. ఇతరులకు, ఆయనకు ఉన్న తేడా ఇదే! “

 

కామెంట్ : దాసరి ఏ ముఖ్యమంత్రినీ కలవకపోతే.. వీళ్లెవరకూ కలవకూడదనడం.. ఇదేం లాజిక్ ఆర్కే గారూ.. అసలు ఇంతకీ మీ బాధంతా.. కమ్మ పెత్తనం ఉన్న ఇండస్ట్రీ పెద్దలు ఆ రెడ్డి గారి ముందు సాగిలపడటం ఏంటి అనేనా.. మరి డైరెక్టుగా ఆ మాటే రాయొచ్చుగా.. ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకో..

మరింత సమాచారం తెలుసుకోండి: