కాలం కలసి రాకపోతే.. తాడే పామై కరుస్తుందంటారు.. ఏం చేయలేం.. ఇప్పుడు తెలుగు దేశాధినేత చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. పాపం.. అంతే కదా.. ఈ దేశానికే ప్రధానులను నిర్ణయించిన వాడు.. బాబూ మీరే ప్రధానిగా ఉండాలని మహా మహా నేతలే సాగిలపడినా తెలుగు నేల కోసం ఆ పదవిని ఎడమ కాలితో తన్నినవాడు.. ఇప్పుడు పాపం.. రాజకీయంగా ఎంత ఇబ్బంది పడుతున్నాడో కదా.

 

 

తన చిరకాల ప్రత్యర్థి వైఎస్‌తోనే ఢీ అంటే ఢీ అన్న ఘన నేత ఇప్పుడు ఆ వైఎస్‌ కొడుకు చేతిలో దారుణ పరాభవం పొందాడు కదా.. అంతేనా.. తన కంటే చాలా జూనియర్ అయిన ఓ పొలిటీషియన్.. ఏకంగా ప్రధాని అయితే.. జూనియర్ ప్రాపకం కోసం ఎంత తగ్గి తగ్గి బతకాల్సి వస్తోంది.. హత విధి.. ఇదే కదా విధి అంటే.. ఎన్నికల ముందు మళ్లీ ఎలాగూ మనమే గెలిచేస్తామన్న ధీమాతో ఆ జూనియర్ ను నోటికొచ్చిన తిట్టల్లా తిట్టేశారు బాబు గారు.

 

 

కానీ.. ఏం చేస్తాం కాలం కలసి రాలేదు. తన పథకాలు పారలేదు. కేంద్రంలోనూ తన అంచనాలు ఘోరంగా తప్పాయి. ఇక ఇప్పుడు మెడపై అనేక కత్తులు వేలాడుతున్నాయి. సీబీఐ నుంచి ఎప్పుడు శ్రీముఖం వస్తుందో అన్నట్టుంది పరిస్థితి. మరి ఇప్పుడు ఏదీ దారి. కాపాడేదెవరు.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒడ్డున పడేయగలవారెవరు.. అలా ఆలోచిస్తే తట్టేది ఒకే ఒక్క పేరు అదే ప్రధాని మోడీ..

 

 

కానీ ఆయన్ని ఎన్నికల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టామే.. మరి సదరు మోడీ కరుణిస్తాడా.. ఏమో చెప్పలేం.. కానీ ప్రయత్నించడం మినహా బాబు గారికి ఆప్షన్ అంటూ ఏమీ మిగల్లేదు. అందుకే ఇప్పుడు ఆయన నోటి వెంట కొత్త డైలాగులు వస్తున్నాయి. అబ్బే.. ప్రధాని మోడీతో నాకు వ్యక్తిగత విభేదాలేమీ లేవంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా మోడీ సూపర్ అంటూ పొగుడుతున్నారు. బీజేపీ నేతలకు చాన్స్ దొరికితే చాలు శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ మోడీ కరుణిస్తాడా.. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: