గత ఏడాది ఏపిలో ఘన విజయం సాధించిన వైసీపీ నేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన దూకుడు పెంచారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరోవైను తన మంత్రి వర్గం విషయంలో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వారికి తగిన సూచనలు ఇవ్వడం.. తీసుకోవడం చేస్తున్నారు.  రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయబోతున్నారు. పిల్లి సుభాష్, మోపిదేవి రాజ్యసభకు ఎన్నిక కావడం వల్ల తమ పదవులకు రాజీనామా చేశారు. త్వరలో రాజ్యసభ సభ్యులుగా వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

IHG

శ్రావణ మాసం ఈ నెల 21న నుంచి ప్రారంభమవుతుంది.. 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ రెండు మంత్రి పదవులకు ఎవరికి ఛాన్స్ దక్కతుందునేది ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన ఇద్దరు బీసీ సామాజిక వర్గం కావడంతో మళ్లీ ఆ వర్గానికి చెందిన వాళ్లకే అవకాశం ఇస్తారా.. జిల్లాలవారీగా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటారా అన్నది చూడాలి. లేకపోతే సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తారా అన్నది ఆసక్తికరం. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తే మోపిదేవి స్థానంలో గుంటూరు జిల్లా నుంచి విడదల రజిని, మరో ఒకరిద్దరు బీసీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు.

IHG

బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తే మోపిదేవి స్థానంలో గుంటూరు జిల్లా నుంచి విడదల రజిని, మరో ఒకరిద్దరు బీసీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు బీసీ కాకపోయినా ఇదే జిల్లా నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా రేసులో ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్‌తో పాటూ మరికొందరు కూడా ఆశలు పెట్టుకున్నారు. సీనియర్లు కొలుసు పార్ధసారథి, ధర్మాన ప్రసాదరావు, రోజా, ఉమ్మారెడ్డి, జోగి రమేష్ ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. మరి జగన్ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: