నిన్న మొన్నటి వరకూ హైదరాబాద్ వాసులను వణికించిన కరోనా ఇప్పుడు తగ్గుముఖం పడుతోందా.. మొన్నటి వరకూ తక్కువ పరీక్షలు చేసినా.. ఎక్కువ కేసులు వచ్చేవి.. కానీ ఇప్పుడు ఎక్కువ పరీక్షలు జరుపుతున్నా.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది.. అంటే  హైదరాబాద్ లో కరోనా తగ్గుముఖం పట్టినట్టేనా..? 

 

 


అవునంటోంది  తెలంగాణ ప్రభుత్వ వైద్య శాఖ.. ఈ శాఖ వెలువరించిన తాజా బులెటిన్ ప్రకారం హైదరాబాద్ లో కరోనా తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. తాజాగా హైదరాబాద్ లో 510 కరోనా కేసులు మాత్రమే పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయని ఈ బులెటిన్ లో తెలిపారు. రంగారెడ్డి , వరంగల్, కరీంనగర్ వంటి చోట్ల కొద్దిగా పెరిగినట్లు ఉన్నా, మొత్తం తెలంగాణ అంతటా కలిపి 1198 కేసులు వచ్చాయి. 

 

IHG


అయితే.. కరోనా పరీక్షలు ఇంతవరకు తెలంగాణలో  2.76లక్షలు జరిగాయి. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో గణనీయంగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా పదిలక్షలకు పైగా కరోనా పరీక్షలు జరిగాయి. అయితే హైదరాబాద్ లోనూ ఇప్పుడిప్పుడే కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్నారు. 

 

 


తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువగా జరిగాయని, ప్రభుత్వతీరు బాగోలేదంటూ హైకోర్టు వ్యాఖ్యలు కూడా చేసింది. ఏది ఏమైనా హైదరాబాద్ లో కరోనా కొత్త కేసులు తగ్గడం శుభ పరిణామనే చెప్పాలి. ప్రభుత్వం కావాలని తక్కువ చేసి చెబుతోందని విపక్షాలు అంటున్నా.. ఆ విమర్శలు నిజమని చెప్పలేం.. కరోనా పాజిటివ్ కేసులు తక్కువ వచ్చిందన్న వార్త నిజమైతే మాత్రం ఇది హైదరాబాద్ వాసులకు నిజమైన పండుగలాంటి వార్తే. 

మరింత సమాచారం తెలుసుకోండి: