ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం అంటేనే టీడీపీకి పెట్టని కోట. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి కంచుకోటను వైఎస్ తొలిసారిగా 2009లో బద్దలు కొట్టేలా వ్యూహాలు రచించారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 11 ఎమ్మెల్యే సీట్లకు ఒక్క ఇచ్ఛాపురం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని నాడు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇచ్ఛాపురం అంటేనే టీడీపీకి కంచుకోట. ఒక్క 2004 ఎన్నికల్లో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ జెండాయే ఎగిరింది.
గత మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ జెండాయే ఎగురుతోంది. 2019లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి బలంగా వీచినా.. ఇక్కడ మాత్రం సైకిల్ జోరుకు వైసీపీ నేతలు బ్రేకులు వేయలేకపోయారు. ఇక ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్థానిక వైసీపీ నేతల వ్యవహారం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పిరియా సాయిరాజ్‌కు ఇచ్చాపురం వైసీపీ ఇన్ చార్జి సాయిరాజ్ పగ్గాలు ఇచ్చిన జగన్ ఆ తర్వాత ఆయన్ను డీసీఎంఎస్ పదవితో మరింత అందలం ఎక్కించారు.
అయినా ఇక్కడ పార్టీ బలోపేతం కాలేదన్న నివేదికలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మునిసిపల్ చైర్మన్ తో పాటు ఆమె భర్త సాయిరాజ్‌కు వ్యతిరేకంగా పావులు కదపడంతో పాటు వారు ఇన్‌చార్జ్ పగ్గాల కోసం పావులు కదుపుతున్నారు. అటు సాయిరాజ్‌తో పాటు మునిసిపల్ చైర్మన్‌తో పాటు లల్లు రామారావు, నరేంద్ర సంతూ ఈ నలుగురు నేతలు కూడా ఇన్‌చార్జ్ పదవి కోసం మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం చుట్టూ తిరుగుతున్నారు. ఈ నలుగురు నేతలు కొట్టుకొంటుండడంతో వైసీపీ అధిష్టానానికి చిర్రెత్తు కొచ్చింది. ఈ క్రమంలోనే అధిష్టానం ఈ నలుగురు నేతలకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు గీత దాటితే వేటేస్తామని వార్నింగ్ ఇచ్చేసిందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి