చైనా వ్యవహారమే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. భారత్-చైనా మధ్య తెరమీదకి వచ్చిన  వివాదం ఎన్నో ఉద్రిక్త  పరిస్థితులకు దారితీసేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే యుద్ధం తప్పదు అనే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే చైనా అక్రమంగా తమ భూభాగాన్ని దాటి.. నిషేధ  స్థలం లోకి వచ్చి ప్రస్తుతం నాటకాలు ఆడుతున్న విషయం తెలిసిందే. ఫింగర్ 8 వరకు వెనక్కి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కేవలం ఫింగర్ 5 దగ్గర మాత్రమే చైనా తిష్ట వేసుకుని కూర్చుంది. ఆ ప్రాంతం నుంచి చైనా వెనక్కి వెళ్ళాలి అంటు  ఎన్ని సార్లు చర్చలు జరిపినప్పటికీ చైనా మాత్రం తీరు  మార్చుకోవడం లేదు.ఎన్ని  చర్చలు జరిగినా ఫలితం మాత్రం లేకుండా పోతుంది. 

 


 అయితే అటు భారత దేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భూభాగాన్ని వదులుకునేందుకు సిద్ధపడడం లేదు. ఈ విషయాన్ని  మొన్నటికి మొన్న లఢక్ లో పర్యటించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా చైనాను వెనక్కి పంపాలి దీని కోసం యుద్ధం చేయడానికైనా  సిద్ధం అని అంటుంది భారత్ . ఈ నేపథ్యంలోనే  భారీగా ఆయుధాలను మోహరించడం తో పాటు భారీగా సైన్యాన్ని కూడా మోహరిస్తున్నారు. దీంతో చైనా భారత్ మధ్య రానున్న రోజుల్లో యుద్ధం తప్పదు అనే వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. 

 

 భారత్ కూడా పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుపుతుండడంతో  పాటు ఆయుధాలను కూడా భారీగా సరిహద్దుల్లోకి మోహరిస్తుండడం ఈ వాదనలకు మరింత బలాన్ని ఇస్తుంది. ఇప్పటికే చైనా రాజధాని బీజింగ్ టార్గెట్ గా  ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భారీగా అను క్షిపణుల మోహరింపు జరుగుతోంది. అయితే ఒకవేళ చైనా భారత్ మధ్య యుద్ధం జరిగితే.. ఓవైపు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా జపాన్ అమెరికా దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనవు  కానీ.. నౌకా  పరమైనటువంటి కొన్ని సౌకర్యాలను  కల్పిస్తాయి.  కానీ యుద్ధం  చేయాల్సింది భారత్ మాత్రమే. మరి ఈ యుద్ధవాతావరణం ఎక్కడ వరకు దారి తీస్తుంది అన్నది రానున్న రోజుల్లో తేలనుంది,

మరింత సమాచారం తెలుసుకోండి: