పీజీ వైద్యులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కౌన్సిలింగ్ లేకుండా తమకు ఏక పక్షంగా పోస్టింగ్లు ఇవ్వడం పై వారు అసంతృప్తిని వ్యక్తపరిచారు. అయితే కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య సేవలు విస్తృతం చేసేందుకు పన్నెండు వందల మంది పేజీ వైద్యులకు వివిధ ఆస్పత్రుల్లో పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితమే ఈ 800 మందికి పోస్టింగ్లు ఇచ్చింది.
అయితే సోమవారం నాటికి వారు ఆయా చోట్ల లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇందులో చాలా మంది రిపోర్ట్ చేయలేదని సమాచారం వచ్చింది. అయితే కనీస సౌకర్యాలు లేవని వాళ్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ విషయాన్ని చెబుతూ వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కి లేఖ రాశారు దీనిలో వసతులు లేని చోట ఎలా పని చేస్తాము అని కూడా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా పీజీ పోస్టింగ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని వైద్య విద్యా సంచాలక కార్యాలయం స్పష్టం చేసింది . అయితే కచ్చితంగా ఈ పీజీ వైద్యులు వాళ్ళకి కేటాయించిన చోట్లలో వాళ్ళు పని చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.
అయితే ప్రతి నెలా వారికి రూ. 70 వేలతో పాటు 10 శాతం ఇన్సెంటివ్ కూడా ఇస్తామని అన్నారు. వీటితో పాటు క్వారంటైన్ కూడా అమలు చేస్తున్నారని వైద్య విద్య వర్గాలు చెబుతున్నాయి. పీజీ వైద్యులు పోస్టింగ్స్ అలానే డిమాండ్లకు సంబంధించిన విషయాలు లేఖలో వ్రాసి సోమవారం హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ పంపించింది. పీజీ వైద్యులకి మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ప్రెగ్నెన్సీ డాక్టర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. పీజీ వైద్యులు కచ్చితంగా ఏడాది పాటు వారికి కేటాయించిన చోట వైద్య సేవలు అందించాల్సిందేనని ప్రభుత్వం ఫైనల్ గా చెప్పేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి