కోవిడ్ -19 పై పోరాటం చేసే యుద్ధంలో ముందు వరుసలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల జీతాలు సకాలంలో ప్రభుత్వాలు చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశించడంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైద్యులకు ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు సకాలంలో చెల్లించేందుకు నడుం బిగించాయి.

జీతాలు సకాలంలో చెల్లించ లేనియెడల విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 'మీరు నిస్సహాయంగా లేరు. మీ ఆర్డర్ అమలు చేయబడిందని మీరు గ్రహించాలి. DM చట్టం ప్రకారం మీకు అధికారం ఉంది. మీరు కూడా చర్యలు తీసుకోవచ్చు', అని సెంటర్ స్టాండ్ పట్ల అసంతృప్తి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ జస్టిస్ ఎం ఆర్ షా అన్నారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలకు జారీ చేశామని కేంద్రం వాదించింది కానీ నాలుగు రాష్ట్రాలు మాత్రం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా అమలు చేయలేదు. వార్తా సంస్థ ANI ప్రకారం, ఈ నాలుగు రాష్ట్రాలు
పంజాబ్,
మహారాష్ట్ర, త్రిపుర మరియు కర్ణాటక. ఆరోగ్య కార్యకర్తలకు క్వారంటైన్ సమయం సెలవుగా పరిగణించబడుతోందని పిటిషనర్ చేసిన ఫిర్యాదుపై ఉన్నత న్యాయస్థానం కేంద్రం నుండి స్పందన కోరింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అలా ఉండకూడదని, దీనిని పరిశీలించడానికి అంగీకరించారు.

ఇకపోతే దేశంలో
కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుంది. వచ్చే రెండు మూడు నెలల్లో కరుణ వైరస్ కి విరుగుడు వ్యాక్సిన్ వస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని
ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.