కానీ అవే నీలిచిత్రాలు, బూతు బొమ్మలను పార్టీ నాయకులు అంతా ఉంటే గ్రూపులో షేర్ చేస్తే.. అందులోనూ మహిళా నాయకులు ఉండే గ్రూపులో షేర్ చేస్తే ఇంకేమైనా ఉందా.. పరువు పోదూ.. అదే జరిగింది కర్నాటకలోని ఓ కాంగ్రెస్ నాయకుడికి . మాజీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవిగౌడ పాటిల్ దూళఖేడ మొబైల్ ఫోన్ నుంచి కొన్ని అశ్లీల ఫోటోలు వాట్సప్ గ్రూప్‌లోకి వెళ్లాయి. ఇంకే ముంది.. గ్రూప్‌లోని సభ్యులందరూ ఈ చిత్రాలను చూసి షాక్ అయ్యారు.
మహిళా నాయకులైతే.. ఆయన తీరుపై మండిపడ్డారు. కావాలనే ఇదంతా చేశారని పార్టీ పెద్దలకు కంప్లయింట్ చేశారు. దీంతో ఫైర్ అయిన పార్టీ పెద్దలు రవిగౌడ పాటిల్‌ను గ్రూప్ నుంచి తొలగించారు. ఆయన్ను వివరణ అడిగారు. దీనిపై స్పందించిన రవిగౌడ పాటిల్.. అది అనుకోకుండా జరిగిపోయిందని చెప్పారు. తాను ఫోన్ ఇంట్లో పెట్టి పెట్టి బాత్ రూమ్‌కు వెళ్లిన సమయంలో చిన్నపిల్లలు మొబైల్ తీసుకుని ఆడుకుంటున్నారని చెప్పారు. ఆ సమయంలో ఫోటోలు వెళ్లి ఉండ వచ్చు, అందరూ నన్ను క్షమించాలని పాటిల్ చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ మాటలు పార్టీ పెద్దలు నమ్మడం లేదు. అలాంటి బూతు చిత్రాలు, నీలి వీడియోలు సాధారణంగా చాలా జాగ్రత్తగా ఫోల్డర్లలో పెట్టుకుంటారని.. అలాంటివి చిన్న పిల్లలు ఓపెన్ చేసి పంపారంటే నమ్మేలా లేదని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం కర్నాటక కాంగ్రెస్ లో కలకలం రేపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి