అలా ప్రోత్సహించడం వల్లే 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎక్కువ సంఖ్యలోనే యువ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఈ కుర్ర ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్ సంపాదించుకున్నారు. ఏడాది కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అలా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ముందువరుసలోనే ఉంటారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇక మొన్ననే మంత్రి పదవి స్వీకరించిన సీదిరి అప్పలరాజు కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్న ఎన్నికల్లో అప్పలరాజు పలాస నుంచి గెలిచారు. ఇక టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌ని మట్టికరిపించిన దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరీకి కూడా నియోజకవర్గంలో బాగానే ఫాలోయింగ్ ఉంది. అటు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కాపు సామాజికవర్గంలో క్రేజ్ బాగానే ఉంది.
ఇటు గురజాల ఎమ్మెల్యే mahesh REDDY' target='_blank' title='కాసు మహేష్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాసు మహేష్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డిలు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి సత్తా చాటుతున్నారు. ఇక తొలిసారి గెలిచిన మహిళా ఎమ్మెల్యేల్లో చిలకలూరిపేట-విడదల రజిని, శింగనమల-జొన్నలగడ్డ పద్మావతిలు కూడా మంచి క్రేజ్ సంపాదించారు. మొత్తానికైతే వైసీపీలో ఈ కుర్ర ఎమ్మెల్యేలకు క్రేజ్ బాగానే ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి