ఇప్పుడు సోము వీర్రాజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన చంద్రబాబు నాయుడు గురించి అతని గత ప్రభుత్వ పరిపాలనావిధానం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కొన్ని విషయాలను తెలుపుతూ, కేంద్రం నుండి చంద్రబాబు సర్కార్ పొందిన నిధులన్నీ వారి సోకులకే సరిపోయింది ఇంక అభివృద్ధి సంగతి దేవుడెరుగు అన్నారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన పోర్ట్ విషయంలో గత టి డి పి ప్రభుత్వం జాప్యం చేసిందంటూ, వారి పరిపాలనా కాలంలో రాష్ట్రానికి ఒక్క పోర్ట్ కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. ఇలా పోర్ట్ లేకపోవడం వలన మత్య్స సంపద మీద ఆధారపడి జీవించే ఎంతోమంది మత్స్యకారులు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. చంద్రబాబు పేరు మీద వేసిన చంద్రన్న బాట రోడ్లు కూడా బి జి పి ప్రభుత్వం నిధులతో వేసినవే అని గుర్తు చేసారు. చంద్రబాబు చెప్పినవి ఒకటి చేసినవి మరొకటి అని ఈ సందర్భంగా సోము వీర్రాజు తెలియచేసారు.
మేము ఇప్పుడున్న వై సి పి ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాము, మీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే రాష్ట్రానికి ఒక పోర్టును నిర్మించి ఎంతోమంది మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. తద్వారా వారి హృదయాలలో ఎప్పటికీ మీరు నిలిచి ఉంటారని హితవు పలికారు. మీరు చేసే వరకు బీ జె పి పార్టీ గుర్తుచేస్తూనే ఉంటుందని, ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్ధానాలను నెరవేర్చి సరికొత్త రాజకీయాలకు మరియు ముందు తరాలవారికి ఆదర్శంగా నిలవాలని తెలియచేసారు. ప్రభుత్వం వారు చెప్పినట్లుగా ఒకవేల పాఠశాలలు తెరవాలనుకుంటే సక్రమంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని విడతల వారీగా ప్రారంభించవలసిందిగా తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి