భోపాల్ లో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వం వైగంగా నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి నేలమట్టం అయింది. నిర్మాణం పూర్తయిందని అధికారికంగా ప్రకటించిన రోజే ఇలా కుప్పకూలిపోవడం విశేషం. నది ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల నదిపై నిర్మించిన పిల్లర్లు కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు పేర్కొంటున్నారు. నాణ్యత లేని వంతెనను నిర్మించిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు.

కొత్త వంతెన నిర్మాణం పూర్తయిన రోజే నేలమట్టం అయిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోని జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్ కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైగంగా నదిపై ప్రభుత్వం వంతెన నిర్మించాలని భావించింది. 150 మీటర్ల వంతెన నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టింది. పనులు వేగవంతంగా పూర్తయ్యాయి. కానీ ఇంకా ప్రారంభించలేదు. ప్రభుత్వం ఆదివారం రోజే వంతెన నిర్మాణం పూర్తయిందని అధికారికంగా ప్రకటించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో వైగంగా నదిపై కొత్తగా నిర్మించిన వంతెన ప్రవాహ తాకిడికి తట్టుకోలేక కుప్పకూలింది. ఏ నిర్మాణానికైనా పునాదే స్ట్రాంగ్ ఉండాలంటారు.. అలాంటిది వంతెనకు వెన్నెముక వంటి పిల్లర్లు కూలిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రధానమంత్రి గ్రామీణ రోడ్డు పథకంలో భాగంగా ఈ వంతెనను అధికారులు ప్రారంభించారు. రూ.3.7 కోట్ల వ్యయంతో 2018 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా ఈ నెల (ఆగస్టు) 30వ తేదీన వంతెన నిర్మాణం పూర్తయింది. వంతెన నిర్మాణం పూర్తయిన సందర్భంగా అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

సియోని జిల్లాలోని సున్వారా, భీమ్ గఢ్ గ్రామాల మధ్య రాకపోకలకు కష్టంగా మారాయి. గ్రామంలో రాకపోకలు సాగించాలంటే  వైగంగా నదిపై వంతెనను నిర్మించాలి. దీంతో నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ పాల్ సింగ్ వైగంగా నదిపై వంతెన నిర్మించాలని ప్రతిపాదించాడు. దీంతో వంతెన ప్రారంభం కూడా జరిగింది. కానీ నాశిరకం వంతెనను నిర్మించడంతో నేలమట్టం అయింది. ఈ నాసిరకం వంతెనను నిర్మించిన కాంట్రాక్టర్, అధికారులపై కఠిన తీసుకోవడం జరుగుతుందని సియోని జిల్లా కలెక్టర్ వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: