అలా చేయడంతో మళ్లీ కరోనా ప్రభావం ఊపందుకుంది.సినీ, రాజకీయ ప్రముఖుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో ఆందోళన చెందిన ప్రభుత్వం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కొనసాగించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం సూచించింది. ఈ రాష్ట్రాల్లో ప్రతి రోజూ దేశంలోనే అత్యధిక కరోనా మరణాలు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు ఎక్కువ శాతం ఇక్కడే వస్తున్నాయి.
అంతేకాదు ఆ రాష్ట్రాల్లో కొవిడ్ మరణాల సంఖ్య తగ్గించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది.ఈ మేరకు కరోనా టెస్టుల ను పెంచాలని కోరింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40 లక్షలు దాటగా..గత 13 రోజుల వ్యవధిలోనే కొత్తగా 10 లక్షల కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో దేశంలో 86,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,అందులో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి.ఏపి లో పాజిటివ్ కేసులు , మరణాలు పెరుగుతున్నాయని ,వైరస్ వ్యాప్తి ని తగ్గించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.ఆయా రాష్ట్ర సీఎం లకు , సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేయాలని నిర్ణయించారు. రెడ్ జోన్ ఉన్న ప్రాంతాల్లో పోలీసులను మోహరించాలని ఆదేశించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి