వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ మేరకు ప్రజలను నానా హింసలకు గురి చేస్తుంది అంటూ ద్వజమెత్తారు.పెట్రోలు, డీజీల్ రేట్లు 3సార్లు పెంచి ప్రజలపై పన్ను భారం మోపుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.లక్షా 12వేల కోట్లు అప్పులు చేశారు. రూ.600 కోట్లు భారం పెంచారు. ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబపై దాదాపు 80 వేలకు పైగా పన్ను భారం పడింది. ఇలా ప్రభుత్వం చేస్తున్న డొంకలను కప్పి పుచ్చుకోవడానికి అమరావతి ఘటనను ప్రస్తావిస్తున్నారు అని ఆమె వ్యాఖ్యానించింది.
ఈ విషయం పై తాను చెప్పిందే శాసనం అన్నట్లు రోజుకో మాటను మారుస్తుంది ఎమ్మెల్యే రోజా. ఇక ఏపి లో ఉన్న లిక్కర్ ఎటుపోయింది. అంబులెన్స్ సర్వీసులు ఎంతవరకు సాగుతున్నాయి అనే విషయాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అంటూ అనురాధ అన్నారు.గతంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పడం వలనే మీరు అధికారంలోకి వచ్చారు. ప్రతి రోజు చంద్రబాబు, లోకేష్ గారిని తిట్టకపోతే వైసీపీ నాయకులకు ముద్ద దిగదు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా దేవాలయాలలో ఘటనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.రాష్ట్రానికి ఏదో పీడ పట్టుకుంది. అందుకనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. గన్ కన్నా ముందు జగన్ వస్తారని రోజా అన్నారు. మూడు రోజుల క్రితం బాలికపై జగిరిన అత్యాచారానికి ఖండించడానికి జగన్ రాలేదు. అప్పుడు ఆయన ఏం రాచకార్యాలను వెలగ బెడుతున్నారని ఆమె ప్రశ్నించింది. కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చుతుంది.. ఎందరో అమాయకపు ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు..అయిన జగన్ సర్కారు పట్టించుకోకపోవడం అవమానకరం అంటూ అనురాధ పేర్కొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి