
ఇలాంటి సమయంలో మిత్ర దేశమైన రష్యా ప్రపంచ దేశాలు అన్నిటికంటే ముందుగానే ప్రజలను కరోనా మహమ్మారి నుంచి రక్షించే దిశగా తొలి వ్యాక్సిన్ను పంపిణీ చేసింది. ఈ వ్యాక్సిన్ ఇదివరకే తమ దేశంలో రెండు క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని విజయవంతంగా పనిచేస్తుంది అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచ దేశాలకు తెలియజేసాడు. అయితే ఇప్పటికే భారత్ లో కరోనా వ్యాక్సిన్ పైన భారత్ బయోటెక్ రెండుసార్లు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి, మూడో ట్రయల్స్ కు సిద్ధంగా ఉంది. ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే సరికి దాదాపుగా మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ వ్యాక్సిన్ను భారత్ కి ఇవ్వాలని సవినయంగా కోరారు. దీనికి వెంటనే స్పందించి రష్యా మూడవ ట్రయల్స్ ను భారత ఔషధ రంగ సంస్థ అయిన రెడ్డీస్ ల్యాబ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
భారత్ లో దాదాపుగా 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా పర్యటనలో భారత సైన్యానికి అవసరమయ్యే యుద్ధ సామాగ్రి , ఎస్-400 మిస్సైల్స్ , సుఖోయ్ యుద్ధ విమానాలు, మిగ్-21 హెలికాప్టర్స్ ను భారత్ కి ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాలు చూసినట్లయితే రష్యా భారత్ ను చైనా దాడుల నుంచి కాపాడే దిశగా పరోక్షంగా సహాయం చేస్తుంది.