గత కొన్ని రోజులుగా ఏపీ లో వివిధ హిందూ వ్యతిరేఖ ఘటనలు జరిగిన విషయం విదితమే. వీటిపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు జరుగుతున్న ప్రతి హిందూ వ్యతిరేఖ సంఘటని అధికార పార్టీకి ముడిపెట్టడం అలవాటుగా మారిపోయింది. ఇందులో భాగంగానే కనకదుర్గ ఆలయంలో సింహాలు అదృశ్య ఘటనపై సంబంధించి అటు అధికార ఇటు ప్రతిపక్ష నాయకుల మధ్యన మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు మరియు మంత్రి కొడాలి నాని. ఇప్పుడు ఈవిషయంపై మంత్రి నాని దేవుడు అంజేయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేఖత ఏర్పడింది.  ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి దేవాలయ మాజీ చైర్మన్ బీజేపీ నేత కోలా ఆనంద్ కొడాలి నానిని ఉద్దేశించి పరుషపదజాలంతో మాట్లాడారు. అంతగా ఏమి మాట్లాడారో కింది ఏపీహెరాల్డ్ ఆర్టికల్ లో చూడండి.

బీజేపీ నేత అయిన కోలా ఆనంద్ మంత్రి కొడాలి నానిని "హిందూ ధర్మం గురించి హిందువుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ నాలుక కోస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందు మతం మీద, ఆలయాల మీద తప్పుడు వ్యాఖ్యలు చేసేముందు మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. నాని మంత్రి పదవి కోసం మతం పేరుతో నాటకాలు ఆడుతున్నాడని ఆయనపై ప్రత్యక్షంగా ఆరోపించారు. ఏడాదికోసారి జుట్టు, గడ్డాలు పెంచుకుని తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకుని వెళ్తున్న కొడాలి నాని.. అదే తిరుమల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని కోలా విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి కొందరు నాయకులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.  అంతేకాకుండా రాష్ట్రంలో రౌడీయిజం ఎక్కువయిందని, ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాలి అని హితవు పలికారు. దేవుళ్ళపైన హిందువుల పైన ఇలాంటి వ్యక్తులు స్వార్ధప్రయోజనాలకోసం చేస్తున్న వ్యాఖ్యల వలన ఎంతోమంది ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఇక ముందు సీఎం జగన్ తిరుమల రావాలంటే డిక్లరేషన్ తప్పకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరియు వైసీపీ వారిని హెచ్చరించారు. ఇంతగా ఆగ్రహానికి గురిచేసిన ఈ విషయంలో అధికార పార్టీ తమ తప్పులను దిద్దుకుంటుందా ? లేదా వీరి వ్యాఖ్యలకు సరిఅయిన సమాధానాన్ని ఇస్తుందా. 

మరింత సమాచారం తెలుసుకోండి: