ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తిరుమల పాలెం పరిధిలోని ఓ గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికలను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో లొంగదీసుకుని చివరికి గర్భవతులను చేశారు. ఇక బాలికలు గర్భం దాల్చారు అన్న విషయం తెలుసుకొని ముఖం చాటేశారు యువకులు. ఈ విషయం గ్రామ పెద్దల వరకూ వెళ్ళింది. దీంతో బాలికలకు అన్యాయం జరగకుండా వారిని మోసం చేసిన వారితోనే పెళ్లి చేయాలి అంటూ గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఇక అనుకున్నదే తడవుగా అదే రోజు రాత్రి ఓ బాలిక కి యువకుడికి పెళ్లి జరిపారు.
ఇక సోమవారం ఉదయం సమయంలో మరో యువకుడికి బాలికకు పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ అంతలోనే కొంత మంది గ్రామస్తులు నుంచి బాల్య వివాహాలు చేస్తున్నారు అంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రామాలయం వద్ద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకుని... మైనర్ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది అనే చెప్పాలి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి