వివరాల్లోకి వెళితే..ఈ అమానుష ఘటన తెలంగాణలో వెలుగు చూసింది.. కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళకు ఇద్దరు కుమార్తెలు. కుటుంబ పోషణ కోసం ఆమె భర్త విదేశాలకు వెళ్ళాడు.కూతుళ్లతో కలసి ఉంటున్న తల్లి అడ్డదారులు తొక్కింది. ఏకంగా కన్నకూతుళ్ల జీవితాలను నాశనం చేసింది. తనకు పరిచయం ఉన్న మెదక్ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్, మరో యువకుడి వద్దకు తరచూ తన పెద్ద కూతురిని పంపించేది. కొద్దీ కాలం వారి టాచర్ ను భరించిన ఆమె ఇంక చేయలేనని తప్పించుకొని పారిపోయింది.
దాంతో చిన్న కూతురిని ఆ పనికి పంపించేది..మృగాళ్లు ఆ చిన్నారి జీవితాన్ని కూడా నాశనం చేశారు. కీచకపర్వం అలా కొనసాగుతున్న తరుణంలో విదేశాలకు వెళ్లిన తండ్రి తిరిగిరావడంతో కూతుళ్లు తమ బాధ చెప్పుకుని విలపించారు. భార్య చేసిన పనికి సిగ్గుపడి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు.. ఈ విషయం పై స్పందించిన ఎస్పీ స్థానిక పోలీసులకు ఈ కేసును అప్పగించారు.కన్నకూతుళ్ల జీవితాలను నాశనం చేసిన తల్లితో పాటు, కానిస్టేబుల్, మరో యువకుడిపైనా కేసులు నమోదు చేశారు. మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన వారిపై పోక్స్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనను విన్న స్థానికులు ఆమె పై ఉమ్మేసారు. కన్న తల్లి వా నువ్వు అంటూ దుమ్మెత్తి పోశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి