అదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి అరుణాచల్ ప్రదేశ్ చైనాలోని భూభాగమని.. భారత్ అక్రమంగా ఆక్రమించుకుంది అంటూ ఆరోపణలు చేస్తూనే ఉంది చైనా. పలుమార్లు చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కవ్వింపులకు దిగుతూనే ఉన్నారు. అయితే ఇటీవల అమెరికా ఈ విషయంపై స్పందిస్తూ లడక్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు భారత్కు చెందిన భూభాగాలు అన్న విషయం ప్రపంచదేశాలు ఎప్పుడో గుర్తించాయని చైనా ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యలు చేయడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది.
ఈ క్రమంలోనే సరిహద్దుల్లో వివిధ ప్రాంతాలలో చొరబడేందుకు చైనా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని నాలుగు ప్రాంతాలలో చైనా సైనికులు చొరబడేందుకు అవకాశం ఉంది అని నిఘా వర్గాల నుంచి భారత సైన్యానికి సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన భారత సైన్యం ఆ నాలుగు ప్రాంతాల్లో పూర్తిగా సైనికులను మోహరించడం తోపాటు ఆయుధాలను కూడా తరలించింది. చైనా చొరబడేందుకు సిద్ధం అయింది అని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన నేపథ్యంలో సైనికులు ఎప్పటికప్పుడు నాలుగు ప్రాంతాల్లో ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి