చైనాలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. చైనా లో ఉండే ముస్లింల పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేనంత దీనస్థితిలో ఉంటుంది. వీగర్  ముస్లింల విషయంలో చైనా వ్యవహరించే తీరు ఎప్పుడు చర్చనీయాంశంగా మారుతు  ఉంటుంది. బానిసల కంటే హీనంగా చూస్తూ ఏకంగా వారి మసీదులను మూసి వేస్తూ.. నిర్బంధించి ప్రభుత్వం  చెప్పినట్లు గానే వినాలి అని ఎప్పటికప్పుడు చైనా నీచమైన  రూల్స్ పెడుతూ ఉంటుంది. ఇలా చైనా ప్రభుత్వ వ్యవహారంతో చైనాలో ఉన్న ఎంతో మంది ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉంటారు.



 అంతేకాకుండా ఉర్దూ విద్యను  పూర్తిగా నిలిపి వేసి ముస్లిం లను  కూడా చైనా  లాంగ్వేజ్ లోనే చదవాలి అని  చిత్రహింసలకు గురి చేస్తూనే ఉంటుంది. అదే సమయంలో గత కొంతకాలంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. వీగర్  ముస్లింలు తమహక్కుల గురించి పోరాటం చేస్తే ఎవరు తెర మీదికి వస్తే వారిని చైనా ప్రభుత్వం అదృశ్యం చేస్తోంది అంటూ టాక్ వినిపించింది. ఇక ఈ విషయాన్ని ప్రపంచదేశాలు ఏకంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాయి . ఈ నేపథ్యంలో సీరియస్గా స్పందించిన ఐక్యరాజ్యసమితి చెందిన  ఒక కమిటీ చైనాలో ముస్లింలు ఉండే ప్రాంతం లోకి వెళ్లి సర్వే నిర్వహించింది.



 ఈ క్రమంలోనే అకస్మాత్తుగా అదృశ్యమైన వారి వివరాలను సేకరించిన ఐక్యరాజ్య సమితి కమిటీ.. చైనా  ప్రభుత్వాన్ని నిలదీసింది. మొదట ప్రభుత్వం  దాటవేత సమాధానం చెప్పినా..  తర్వాత మాత్రం అదృశ్యమైన వారిలో ఒక వ్యక్తి గురించి మాత్రం ప్రభుత్వానికి తెలుసని... ఆ వ్యక్తి అదృశ్యం కావడం వెనుక ప్రభుత్వం హస్తం ఉంది అంటూ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ హక్కులు కావాలని తెర మీదికి వచ్చి పోరాటం చేసే ప్రతి ఒక్కరిని చైనా అదృశ్యం చేసి చివరికి ప్రాణాలు తీస్తుంది అన్న విషయం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కమిటీ సర్వేలో తేలింది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: