మామూలుగా కోతులు  అన్న  తర్వాత ఎప్పుడు కోతి పనులు చేస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అయితే అడవులను వదిలేసి జనావాసాల్లోకి  వస్తున్న కోతులు  ప్రజలందరినీ ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇళ్లను  ధ్వంసం చేయడం లేదా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం లాంటివి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కోతులు  చేసిన పని ఏకంగా ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణం అయింది. ఈ ఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది. ఆగ్రా లో  ఈ మధ్యకాలంలో కోతుల బెడద మరీ ఎక్కువైపోయింది. ఏ క్షణంలో వచ్చి దాడి చేస్తాయోనని అందరూ భయంతో ఊగిపోతున్నారు.




 అయితే ఇటీవలే ఆగ్రాలోని ఓ ప్రాంతంలో ఓ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో యజమాని దానిని మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలోని మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. భవనం యజమాని మరో వ్యక్తి ఒక గోడ పక్కన నిలబడి ఉన్నారు. ఇంతలో ఊహించని ఘటన రెండు కోతుల గుంపు అక్కడికి చేరుకున్నాయి. రెండు గుంపుల  మధ్య భీకరమైన పోరు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే పోట్లాడుకుంటూ ఒక గుంపు మొత్తం శిథిలావస్థలో  ఉన్న భవనం పైకి దూకింది. దీంతో ఒక్కసారిగా భవనం కూలిపోయింది. గోడ పక్కనే నిలబడ్డా యజమాని సహా మరో వ్యక్తి పై కూడా శిథిలాల్లో  పడిపోయారు.



 తర్వాత స్థానికులు గమనించి వారిని బయటకు తీశారు.  తీవ్ర గాయలపాలయ్యారు ఆ ఇద్దరు వ్యక్తులు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు స్థానికులు. తలపై బలమైన గాయం కావడంతో ఇద్దరూ కూడా చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు. 40 కోతులు  గోడపై దూకడంతో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. అంతేకాదు ఇటీవల తల్లి ఒడిలో నుంచి బిడ్డను లాక్కెళ్లి న ఘటన కూడా చోటు చేసుకుంది. చివరికి పసిబిడ్డ విగతజీవిగా కనిపించింది. ఇలా రోజురోజుకు కోతుల బెడద తో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని ప్రజలందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: