ఏపీలో ఏ ప్రభుత్వం ఎక్కువ దుబారాగా ఖర్చు చేస్తుంది? అనే ప్రశ్న ఎదురైతే న్యూట్రల్‌గా ఉండే వ్యక్తుల నుంచి...ఎవరు తక్కువ కాదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే దుబారాగా ఖర్చు చేయడంలో గతంలో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బాగానే పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ దుబారా ఖర్చుల గురించి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరుగుతుంది.

చంద్రబాబు తన దొంగ దీక్షలకు అధికారంలో ఉండగా 300 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, ఇక పోలవరం యాత్రల పేరిట 400 కోట్లను వృధా చేశారని, కానీ జగన్ మాత్రం  పేద పిల్లలకు 650 కోట్లు ఖర్చు చేసి కిట్స్ ఇచ్చారని విజయసాయిరెడ్డి చంద్రబాబుకు చురకలు అంటించారు. అయితే విజయసాయి చేసిన విమర్శలు కరెక్ట్‌గానే ఉన్నాయని చెప్పొచ్చు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో దుబారా చాలానే అయింది.

అమరావతి గ్రాఫిక్స్ కోసమే చాలా అయింది. అటు హంగులు, ఆర్భాటాలా కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఇంకా కేబినెట్ సమావేశాలు జరిగితే ఎంత పనికిమాలిన ఖర్చులు ఎక్కువగా ఉండేవి. అలాగే విదేశాల టూర్లకు, ప్రచారాలకు చాలానే ఖర్చు అయింది. అయితే విజయసాయి, చంద్రబాబు దుబారా గురించి మాట్లాడితే, టీడీపీ నేతలు ఎందుకు ఊరుకుంటారు, వారు కూడా జగన్ దుబారా గురించి మాట్లాడుతున్నారు.

4 వేల కోట్లతో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా? అని విజయసాయిని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అలాగే తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు, నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు, సిబిఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతీ వారం 60 లక్షలు, మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్లు, మీ అవినీతి పత్రికకు వందల కోట్లు, మీరు చేసే వేల కోట్ల దందాలు, మొత్తం లెక్క తీస్తే 10 పోలవరం ప్రాజెక్టులు  కట్టవచ్చు అంటూ బుద్దా సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

ఇక ఈ రెండు పార్టీల విమర్శలని చూస్తే దుబారాలో ఎవరు తక్కువ కాదని తెలుస్తోంది. కాకపోతే ప్రజలకు మేలు చేసే విషయంలో జగన్ ప్రభుత్వమే ఓ అడుగు ముందు ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: