పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రజలందరిని ఆకర్షించేందుకు ఎన్నోరకాల సంస్థలు అద్భుతమైన ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తాయి అన్న విషయం తెలిసిందే. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ఫ్లిప్కార్ట్ సంస్థలు పోటాపోటీగా అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తూ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇక ఈ పండుగ సీజన్లో ఎన్నో అద్వితీయమైన ఆఫర్లను కష్టమర్ లందరికీ అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. భారీ డిస్కౌంట్లు క్యాష్ బ్యాక్ ఆఫర్ లు ఇలా ఎన్నో రకాల ఆఫర్లు ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో ఎక్కువగా షాపింగ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు కస్టమర్లు.



 ప్రస్తుతం భారీ డిస్కౌంట్లు ఆఫర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇలాంటి సదవకాశం మళ్ళీ  వచ్చే అవకాశం లేదు అని భావిస్తున్న కస్టమర్లు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నో వస్తువులను ప్రస్తుతం  ఈ కామర్స్ దిగ్గజ సంస్థలైన అమెజాన్ ఫ్లిప్కార్ట్ ల  ద్వారా ఆర్డర్  చేస్తున్నారు. దీంతో ఈ రెండు సంస్థలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ పండుగ సీజన్లో అద్వితీయమైన ఆఫర్లు అటు కస్టమర్ల పంట పండిస్తుంటే... భారీ  ఆర్డర్లు అమెజాన్ ఫ్లిప్కార్ట్ సంస్థల పంట పండిస్తున్నాయి.




 ఈనెల 17వ తేదీ నుంచి పండుగ ఆఫర్లను  గ్రేట్ ఇండియా ఫెస్టివల్ పేరిట ఈ  కమర్ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభించిన 48 గంటల్లోనే 1.1 లక్షల విక్రేత లకు ఆర్డర్లు అందించినట్లు అమెజాన్ సంస్థ ప్రకటన కూడా చేసింది. ఇక మరోవైపు బిగ్ బిలియన్ డేస్ అనే పేరిట ఈ పండుగ సీజన్లో అద్వితీయమైన ఆఫర్లను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫ్లిప్కార్ట్. ఈ క్రమంలోనే మూడు రోజుల వ్యవధిలోనే ఏకంగా మూడు లక్షల ఆర్డర్లను అందించినట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. వినియోగదారులందరూ నుంచి మొత్తం ఎన్ని ఆర్డర్లు వచ్చాయి అనే విషయాన్ని మాత్రం ఈ రెండు సంస్థలు ఇప్పటి వరకు ప్రకటించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: