రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలోనే అతి పెద్ద మచ్చ.. ఓటు కు నోటు కేసు.. 2015లో అప్పట్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేంనరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ కు ఓటు వేసేందుకు రూ.50 లక్షలు లంచం ఇస్తూ వీడియో ఆధారాలతో సహా దొరికిపోయారు. అప్పట్లో ఇది పెను సంచలనంగా మారింది. అయితే మన దేశంలో ఏసీబీ, సీబీఐ కేసులు అంటే.. ఏళ్ల తరబడి సాగుతాయన్న సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదు కేసే.. 30 ఏళ్ల తర్వాత మొన్న తేలింది. ఇక ఇలాంటి కేసుల సంగతి చెప్పేదేముంది.

అయితే తాజాగా ఓ కేసు విచారణలో భాగంగా.. ఏసీబీ కొన్ని విషయాలు బయటపెట్టింది. అసలు ఈ కేసులో ఏం జరిగిందో కోర్టుకు వివరించింది. టీడీపీకి అనుకూలంగా ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ ఓటు వేయించడానికి 2015, మే 27న జరిగిన తెదేపా మహానాడులో రేవంత్‌రెడ్డి, బిషప్‌ హ్యారీ సెబాస్టియన్‌, రుద్ర ఉదయసింహ, మత్తయ్య జెరూసలెంలు కలిసి కుట్రపన్నారని కోర్టుకు ఏసీబీ వివరించింది. అందులో భాగంగానే రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించడానికి సిద్ధమయ్యారని తెలిపింది.

రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌లతో సండ్ర వెంకటవీరయ్య శంషాబాద్‌ నొవాటెల్‌ హోటల్‌లో కలిసి చర్చించారట. ఓటుకు నోటు వ్యవహారంలో రూ.50 లక్షల నగదును రుద్ర ఉదయ్‌సింహ తీసుకెళ్లారట.  స్టీఫెన్‌సన్‌ ఫ్లాట్‌లోకి మొదట రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌ ఒక కారులో వెళ్లారట. అనంతరం ఉదయ్‌సింహ నగదు ఉన్న బ్యాగుతో వెళ్లారట. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడానికి స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు రేవంత్‌రెడ్డి బేరం కుదిర్చారట. రేవంత్‌ సూచనల మేరకే బ్యాగులోని రూ.50 లక్షలను ఉదయ్‌సింహ బయట పెట్టారని ఏసీబీ కోర్టుకు తెలిపింది.

2015, మే 31న రేవంత్‌రెడ్డి శంషాబాద్‌ నొవాటెల్‌ హోటల్‌ నుంచి స్టీఫెన్‌సన్‌ను కలవడానికి పుష్ప నిలయానికి బయలుదేరారట. నల్గొండ క్రాస్‌ రోడ్డు వద్దకు రావాలని తన అనుచరుడైన ఉదయ్‌సింహకు ఫోన్‌ చేశారట. అయితే.. మెట్టుగూడ క్రాస్‌లో ఉన్న వేంనరేందర్‌రెడ్డి కుమారుడు వేంకృష్ణ కీర్తన్‌ నుంచి రూ.50 లక్షలు తీసుకుని రావాలంటూ రేవంత్‌రెడ్డి చెప్పారట. నగదు తీసుకుని పుష్పనిలయానికి ఉదయ్‌సింహ బయలుదేరాట. ఈ మొత్తం సమాచారం సేకరించిన ఏసీబీ వలపన్ని నగదుతో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహలను పట్టుకుని అరెస్ట్‌ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: