జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గరపడుతోంది.. అవినీతి రాక్షసులను చీల్చడం, ప్రజలకు సుపరిపాలన అందించడం వంటి కార్యకలాపాలతో తొలి అర్ధభాగం గడిచిపోతుంది.. ఇక ఇప్పుడు రెండో అర్థ భాగంలో ఏం జరగబోతుందో చూడాలి.. అయితే దానికంటే ముందు జగన్ మంత్రి వర్గ విస్తరణ చేయాల్సి ఉంది.. అధికారంలోకి వచ్చిన మరునాడే రెండు సార్లు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తేల్చిచెప్పాడు జగన్.. ఆ క్రమంలోనే చాలామంది కి తొలిసారి మొండి చేయి చూపాల్సి వచ్చింది.

మంత్రి పదవులు ఇచ్చే దిశలో సామాజిక వర్గాల సమతూకం ఉండేలా జగన్ ప్లాన్ చేసి మరీ తొలుత మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు.. విధేయులు ఎందరికో మొండి చేయి చూపాల్సి వచ్చింది. అయినా సామాజిక వర్గాల లెక్కలు చూడడం లోనూ, ఆ లెక్కలు సరిచేయడంలోనూ జగన్ సక్సెస్ అయ్యారు. జగన్ క్యాబినెట్ పై నోరు మెదిపేందుకు విపక్షాలకు సైతం అవకాశం దొరకలేదు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మంత్రుల పనితీరుపై జగన్ కు కొంత అసంతృప్తి ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. కొంతమంది మంత్రులు పనితీరు పరంగా ఫర్వాలేదు అన్నట్టుగా అనిపించుకుంటున్నా, మరికొంతమంది పనితీరు, మితి మీరిన జోక్యం, అవినీతి వ్యవహారాలు వంటివి జగన్ కు రుచించడం లేదు.

అందుకే ఈ మంత్రి వర్గ విస్తరణ లో జగన్ కొన్తమానుడికి ఉద్వాసన పలకాలని అనుకుంటున్నారట.. ఆ లిస్ట్ లో నలుగురు పేర్లు విమపడుతున్నాయి.. త పదిహేడు నెలల్లో ఒకరిద్దరు మంత్రుల మీద తప్పించి ఎవరిపై అవినీతి ఆరోపణలు రాలేదు.కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరాంపైనే ఇప్పటి వరకూ ఆరోపణలు వచ్చాయి. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల పై కూడా చాలా ఆరోపణలు వచ్చాయి.. ఇక కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన మంత్రుల పనితీరుపైన కూడా వైసీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తమవుతోంది.  ఈ సారి విస్తరణలో వీరికి మొండి చేయి చూపడడం గ్యారెంటీ అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: