ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం దొంగలు ఎంతో వినూత్న ఆలోచించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక ఈ దొంగల బెడద తగ్గించడం అటు  పోలీస్ అధికారులకు రోజురోజుకు పెద్ద సవాలుగా మారిపోతుంది. అయితే ఎంతో మంది దొంగల ముఠా లను పట్టుకొని జైలుశిక్ష వేసినప్పటికీ కూడా సరికొత్త దొంగ ముఠాలు వెలుగులోకి వస్తు పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నాయి . ముఖ్యంగా ధనవంతుల ఇళ్లనే టార్గెట్ గా చేసుకుంటున్న ఎన్నో దొంగలముఠాలు ఎంతో చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.



 ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ధనవంతుల ఇళ్లలో పని మనుషులుగా చేరి... ఎన్నో రోజుల పాటు యజమానుల దగ్గర నమ్మకంగా పని చేస్తున్నారు. మంచితనంతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయి అని అవగాహన వచ్చిన తర్వాత సరైన సమయం చూసి ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇంటి యజమానులు మత్తుమందు లో కి చేరుకోగానే ఇక ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు నగదు నగలు అన్నీ దోచుకు పోతున్నారు. ఇటీవలే ఇలాంటి దొంగల ముఠా రాచకొండ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు తోసారూ.


 నేపాల్కు చెందిన కైకాలి దొంగల ముఠా లో ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి తొమ్మిది తులాల నగలు.. ఒకటిన్నర లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దొంగల ముఠా లోని  మరో నలుగురు సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ఇటీవలే నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటి నగర్ లో ఇంట్లో పనివాళ్లు గా చేరిన ఈ దొంగల ముఠాకు చెందిన కొంతమంది సభ్యులు తేనీరులో  నిద్రమాత్రలు కలిపి ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. ఇంట్లో నుంచి 18 తులాల బంగారం 40 తులాల వెండి 10 లక్షల నగదు తీసుకుని అక్కడి నుంచి  పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇంటి యజమాని ప్రదీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగి ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: