రవిప్రకాశ్.. తెలుగునాట ఎలక్ట్రానిక్ జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన జర్నలిస్టు. ఎన్ని వివాదాలు ఉన్నా.. ఈ విషయంలో మాత్రం ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే టీవీ9 స్థాపించడమే కాకుండా దాన్ని విజయవంతంగా నడిపించారాయన. టీవీ9 నుంచి బయటకు వచ్చాక ఆయన ఏంచేస్తున్నరన్నది ఆసక్తికరంగా మారింది. జర్నలిజం అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న ఆయన ఏదో ఒక కొత్త ఛానల్ తెస్తారని అంతా ఊహిస్తూనే ఉన్నారు. కానీ.. ఆయన కొంత కాలంగా అనేక కేసుల చుట్టూ తిరగడంలోనే సమయం గడిపేశారు.


టీవీ9 యాజమాన్యం మారక.. టీవీ9నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారంటూ కొత్త యాజమాన్యం ఆయనపై ఆరోపించింది. కేసులు పెట్టింది. ఈ విషయంలో ఆయన కొన్ని రోజులు జైల్లోనూ ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లోని బీఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో పోలీసులు కొన్నాళ్లుగా వెతుకుతున్న ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా పట్టుబడ్డాడని మరో వివాదం తెరపైకి వచ్చింది.


అయితే ప్రస్తుతం రవిప్రకాశ్.. రాజ్‌ న్యూస్ అనే ఛానల్‌కు సీఈవో కాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. రాజ్ న్యూస్ తెలుగు, కన్నడ ఛానల్స్ తోపాటు విస్సా టీవీని కూడా రవిప్రకాశ్ నడిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ ఛానళ్ల పేర్లు ఎప్పుడూ వినలేదే అంటారా.. అవును.. అవి కూడా ఉన్నాయి.. కాకపోతే ఉన్నట్టుగా ఉంటాయి అంతే.. వీటిలో అంత క్వాలిటీ న్యూస్ రాదు.. అందుకే వీటిని ఎవరూ పట్టించుకోరు. కాకపోతే.. ఎవరికైనా అర్జంటుగా టీవీ ఛానల్ కావాలంటే మాత్రం ఇవి గుర్తొస్తాయి.


గతంలో టీ న్యూస్ ప్రారంభించక ముందు టీఆర్‌ఎస్ పార్టీ ఈ రాజ్‌న్యూస్‌నే వాడుకుంది. తెలంగాణ ఉద్యమం రోజుల్లో రాజ్ న్యూస్ బాగానే జనంలోకి వెళ్లింది. ఇప్పుడు తిరిగి ఆ ఛానల్‌ను బీజేపీ నడిపించాలని భావిస్తోందట. అందుకోసమే వాళ్లు రవిప్రకాశ్ ను సంప్రదించారని.. ఆయన ఓకే చెప్పారని మీడియా సర్కిళ్లో ప్రచారం జరుగుతోంది. ఇవి కాకుండా రవిప్రకాశం తొలి వెలుగు అనే ఓ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. దీన్ని 24 గంటల న్యూస్ ఛానల్‌ గా తెచ్చే ప్రయత్నాల్లోనూ ఉన్నారట. చూడాలి ఏది ముందు తెరపైకి వస్తుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: