గత రెండు మూడు నెలల నుంచి ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఓవైపు సరిహద్దుల్లో అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను ఎక్కడికక్కడ మట్టు పెట్టడంతోపాటు.. ఓవైపు భారత దేశంలో ఉంటూ ఎంతో రహస్యంగా మారణహోమంకు ప్లాన్ చేస్తున్న ఎంతోమంది ఉగ్రవాదులను గుర్తించి మట్టు పెడుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎన్నో ఆయుధ డంపులను కూడా ధ్వంసం చేస్తుంది భారత సైన్యం. ఈ పోరాటంలో ఎంతో మంది భారత సైనికులు కూడా వీరమరణం పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవలే జమ్మూకాశ్మీర్లోని ఎల్ఏసి వెంబడి పహారా కాస్తున్న 4 భారత సైనికులు వీరమరణం పొందారు. ఎల్ఏసి వెంబడి నిన్న ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందగా.. ఇందులో ఇద్దరు తెలుగు జవాన్లు ఉండటం గమనార్హం. ఉగ్రవాదుల చొరబాటు అడ్డుకునే క్రమంలో ఎన్కౌంటర్ జరగ్గా ఎన్కౌంటర్లో ఎంతో మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అదే సమయంలో నలుగురు భారత సైనికులు కూడా వీరమరణం పొందారు. ఇక ఇందులో నిజాంబాద్ కు చెందిన మహేష్ చిత్తూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ లు ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి