నితీశ్‌ కుమార్‌ విస్తృతమైన ప్రజాకర్షణ ఉన్న నేత కాదు. కానీ ప్రజామోదం ఉన్న నేత. ఆటవిక రాజ్యాన్ని అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం బీహార్‌లో ఎన్డీయే విజయంతో నితీశ్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని జేడీయూ చెబుతోంది. అయితే బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే జేడీయూకి ఆ అవకాశం దక్కుతుందా అనేది అతి పెద్ద ప్రశ్న.

2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి వైదొలగారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూటమి కట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించినా.. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జత కట్టారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఎన్డీయే గెలిస్తే నితీశ్ కుమారే ముఖ్యమంత్రి అని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా కూడా పలు ఎన్నికల సభల్లో ప్రకటించారు.

బీహార్ బీజేపీలో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. కుమార్ మోడీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుశీల్ కుమార్ మోడీ ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ విజయంలో ఆయన పాత్ర కొట్టి పారేయలేనిది. బీహార్ నుంచి కేంద్రమంత్రులుగా ఉన్న నేతలు కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా రంగంలోకి దిగుతారు. నితీశ్ కుమార్‌ గతంలో మహా కూటమిని వదిలేసినట్లే.. మధ్యలోనే ముఖ్యమంత్రి పదవి వదిలి పెట్టి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిందేమీ ఉండకపోవచ్చు.

బీహార్‌లో ఎన్నికల రాజకీయం ముగిసిన తర్వాత.. అసలైన రాజకీయం త్వరలోనే ప్రారంభం కావచ్చు. జేడీయూ ఆశించిన స్థాయిలో సీట్లు గెలవలేకపోవడానికి కారణం నితీశ్ కుమారే అనే ఆరోపణ ఆయన సొంత పార్టీ నుంచే రావచ్చు. అలాంటిదేమైనా వస్తే..  ఆ అవకాశాన్ని బీజేపీ వదిలేస్తుందా?. మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. జూనియర్ పార్ట్‌నర్‌ శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ససేమిరా అంది. బీహార్‌లో అందుకు సమ్మతిస్తుందా?. రానున్న రోజుల్లో ఒకప్పటి పాటలీ పుత్రం రసవత్తర రాజకీయాలకు పాట్నా వేదిక అవుతుందా.


మరింత సమాచారం తెలుసుకోండి: