అంశాలకు వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం రానే వచ్చింది. జిహెచ్ఎంసి ఎన్నికల సందడి మొదలయింది. జిహెచ్ఎంసి నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో, ఇలా హవాలా వ్యాపారులతో మంతనాలు మొదలుపెట్టారట కొందరు నేతలు. ఇంకేముంది గతంలో కంటే ఇప్పుడు టెక్నాలజీ  బాగా పెరిగింది... పోలీసు శాఖలో అత్యున్నత టెక్నాలజీ వినియోగించి దాంతోపాటు వారి మెదడుకు పదును పెట్టి ఎంతటి కుంభకోణం అయినా ఇట్టే... కనిపెట్టేస్తున్నారు పోలీసులు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు
వారి పై నిఘా  మరింత పటిష్టం చేశారు.

జిహెచ్ఎంసి ఎన్నికల సమయం కావడంతో....హైదరాబాద్‌లో హవాలా రూటింగ్‌పై దృష్టి కేంద్రీకరించారు పోలీసులు. రాబోతున్న ఎన్నికల  కోలాహలం లో నిమగ్నులైన రాజకీయ నేతలకు ఝలక్ ఇచ్చారు పోలీసులు. బేగంబజార్‌ కేంద్రంగా హవాలా రూటింగ్‌ నడుస్తున్నట్టు పసిగట్టిన పోలీసులు.. హవాలా గ్యాంగ్‌ల కోసం పనిచేస్తున్న సప్లయర్స్‌పై దృష్టిపెట్టారు. అంతేకాదు కేవలం  గత మూడు రోజుల వ్యవధిలోనే కోటికి పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ నగదు యజమానులకు గట్టి షాక్ తగిలింది. అటు రాజకీయ నాయకుల సందడి ఇటు పోలీసుల నిఘా. నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లో ఎన్నికలు హాట్ హాట్ గా మారాయి.

అన్ని పార్టీల కార్యకర్తలు.... ప్రస్తుతం ఓటర్లను ఆకర్షించేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. తమను గెలిపిస్తే..... వారికి ఏం చేస్తామో.... ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో  చెబుతూ... హామీలు ఇస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కృషి చేస్తున్నారు. ఇక అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు..   ప్రస్తుతం హైదరాబాదులో జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం  ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అన్ని విషయాలలోను తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు 50 వేల కంటే ఎక్కువ నగదు పట్టుబడితే.. దానికి సంబంధించిన రసీదు ఉండాలని లేదా నగదు సీజ్ చేస్తామని షాక్ ఇచ్చారు. ఎన్నికల వేళ హవాలా గ్యాంగ్స్ ల విషయంలో అలర్ట్ అయిన పోలీసులు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: