భారత నౌకా దళానికి చేరుకున్న మహా ఆయుధం. ఇక సముద్రగర్భంలో దాక్కున్న శత్రువులకు చుక్కలే అని అంటున్నారు. భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ శత్రువులను మట్టికరిపించే ఆయుధం... సబ్‌మెరైన్‌ని అత్యంత బరువున్న టార్పెడో వారుణాస్త్రని తయారుచేసింది. ప్రస్తుతం ఈ ఆయుధం  భారత రక్షణ దళం అమ్ముల పొది లో కి చేరుకుంది. ఇక సముద్రగర్భంలో భారత దేశానికి నష్టం వాటిల్లే ప్రయత్నాలు చేసే... శత్రుదేశాల సబ్‌మెరైన్‌ లకు ఈ ఆయుధంతో సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉంది భారత నౌకాదళం. శత్రు దేశాల నుండి పొంచి ఉన్న ముప్పును అడ్డుకునేందుకు గాను ఈ ఆయుధం తయారుచేయబడింది. ఎంతో శక్తివంతమైన...అత్యంత బరువున్న టార్పెడో వారుణాస్త్రం  ఇప్పుడు బాల్ నౌకాదళంలో కి చేరడం నిజంగా గొప్పవిషయం అంటున్నారు రక్షక దళాల అధికారులు.

 భారతదేశం పై కుట్రలు పన్ని... రహస్యంగా సముద్ర మార్గంలో సరిహద్దులు దాటి దొంగ దెబ్బ తీసే శత్రువులను మట్టికరిపించేందుకు. వారి రాక్షస పన్నాగాలు నుండి మన దేశాన్ని రక్షించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడే వజ్రాయుధంగా ఈ ఆయుధాన్ని కొనియాడుతున్నారు. సముద్రగర్భంలో ఉన్న శత్రుదేశాల సబ్ మెరైన్లను ముక్కలు ముక్కలుగా చేసే శక్తి కలిగిన ఆయుధం... భారత్ కు ముక్కు తల పెట్టాలనుకునే శత్రువుల ఎత్తులను పటాపంచలు చేసే ఇప్పుడు భారత నేవీ లోకి చేరడం నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం. టార్పెడో వారుణాస్త్రం భారత నౌకాదళానికి మరింత బలాన్ని చేకూర్చిందని...సముద్రగర్భంలో ఉన్న శత్రుదేశాల సబ్ మెరైన్లను ముక్కలు ముక్కలుగా చేసే శక్తి కలిగిన  ఆయుధం ఇప్పుడు మన వద్దకు చేరింది.

అందులోనూ ఇటువంటి మహా యుద్ధాన్ని 95 శాతం పూర్తి స్వదేశీ పరి జ్ఞానంతో తయారు చేయడం విశేషం. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకి చెందిన  ఎన్‌ఎస్‌టీఎల్  ఈ  టార్పెడో వారుణాస్త్రాన్ని
డిజైన్‌  చేయగా... బీడీఎల్‌ దీన్ని రూపొందించింది. డీఆర్‌డీవో చైర్మన్‌ డా.జి.సతీష్‌రెడ్డి చేతుల మీదుగా టార్పెడో వారుణాస్త్రాన్ని భారత్
 నేవీకి అప్పగించారు.... శత్రువుల గుండెల్లో దడ పుట్టించే ఇటువంటి ఒక గొప్ప ఆయుధం మన  నౌకాదళానికి చేరుకోవడం  ఆనందించదగ్గ విషయం అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: