భాగ్య నగరం లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరు నానాటికీ పెరుగుతూ వస్తుంది. బరిలో ఉన్న పార్టీలు ఎవరికీ వారే అన్నట్లు గట్టి పోటీతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..కాగా, నిన్నటి వరకు టీఆరెఎస్, బీజేపి లు ప్రచారంతో వేడెక్కించారు.. ఇక ఇప్పుడు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు బరిలోకి దిగాయి.. నగరంలోని చాలా ప్రాంతాల్లో తెరాస పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ముఖ్య మంత్రితో సహా పలువురు మంత్రులు హైదరాబాద్ అభివృద్ధికి టీఆరెఎస్ పార్టీ ఏం చేసిందో వివరిస్తూ రోడ్ షో లు, ర్యాలీలు చేస్తున్నారు..



ఇది ఇలా ఉండగా సిద్దిపేట లోని పలు ప్రాంతాల్లో మంత్రి హరీష్ రావు అభ్యర్థులకు మంచి సపోర్ట్ ను ఇస్తూ వస్తున్నారు. ఈ మేరకు రామచంద్రాపురంలో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ సర్జికల్ స్ట్రైక్, ఎంఐఎం పీవీ, ఎన్టీఆర్ ఘాట్ కూల్చివేత వ్యాఖ్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీ కి సర్జికల్ స్ట్రైక్ తో ఏం వస్తుందో చెప్పాలని అన్నారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన అభివృద్ధి, చేయవల్సిన అభివృద్ధి గురించి చెప్పకుండా కూల్చుతాం, కాల్చుతాం అని ప్రచారం చేస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు.



వరద వల్ల భారీగా నష్ట పోయిన ప్రజలకు ప్రభుత్వం సాయమందిస్తుంటే ప్రతి పక్షాలు వాటిని అడ్డుకుంటున్నాయి. ప్రజల పొట్ట దగ్గర కూడును లాక్కుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల ఫలితాల తరువాత ప్రతి ఒక్కరికి వరద సహాయం ఇస్తామని అన్నారు.. అయితే ప్రశాంతమైన వాతావరణం కావాలనుకుంటే టీఆరెఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని హరీష్ రావు కోరారు.. టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. హైదరాబాద్ లో అమెజాన్ కంపెనీ రూ.21 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని, శాంతిభద్రతల సమస్యలు ఉంటె పెట్టుబడులు ఆగిపోతాయని ఈ సందర్బంగా అన్నారు..సిద్దిపేటలో ఉన్న నియోజక వర్గాల అభ్యర్థులను తమ విలువైన ఓటు వేసి గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: