ఇలా రోజురోజుకు దొంగల బెడద ఎక్కువ అవుతోంది. కొంతమంది ఇంట్లో పనివాడిగా చేరి నమ్మకం గా మారిన తర్వాత సరైన సమయం చూసి అందిన కాడికి దోచుకో పోతూ ఉంటే.. మరికొంతమంది ఇంటి పక్కనే ఉంటూ ఎంతో నమ్మకంగా ఉండి చివరికి సరైన సమయం కోసం చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటి యజమానులకు భారీ షాక్ తగులుతుంది. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇంటి పక్కన ఉన్న వ్యక్తే ఏకంగా దొంగతనానికి పాల్పడడంతో ఇంటి యజమానులు షాక్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ ఆ దొంగ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి గా మారిపోయింది పరిస్థితి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పద్మా నగర్ లో చోటు చేసుకుంది. దొంగను గుర్తించిన స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇంటి పక్కన ఉండే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ఎంతో రహస్యంగా వెళ్లి బీరువాలో ఉన్న ఏడు లక్షల నగదును అపహరించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకున్నారు. స్థానికులను పిలవడంతో అందరూ కలిసి అతనికి దేహశుద్ధి చేసి చివరికి పోలీసులకు అప్పగించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి