ఏపీలో న్యాయవ్యవస్థకూ ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై హైకోర్టు న్యాయమూర్తులు అనేక సార్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా.. అసలు ప్రభుత్వం ఉందా.. రాజ్యాంగం అమలవుతుందా.. అంటూ ప్రశ్నించారు. జస్టిస్ రాకేశ్ కుమార్ అయితే ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తానంటూ సంచలనం సృష్టించారు కూడా. చివరకు ఆ విషయంలో జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది.

అయితే మొట్టమొదటిసారి ఓ హైకోర్టు జడ్డి.. ఈ సమరంలో తమ తప్పు కూడా ఉందని ఒప్పుకున్నారు.  ఆయనే జస్టిస్ రాకేశ్ కుమార్.. జగన్ సర్కారుతో జగడం పెట్టుకున్న న్యాయమూర్తుల్లో ఈయన ఒకరు. అనేక కేసుల సందర్భంగా ఈయన జగన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈయన ఇవాళ రిటైర్ అవుతున్నారు. సరిగ్గా రిటైర్ అయ్యే ఒక్క రోజు ముందు బాంబు పేల్చేశారు.  మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసు విచారణ నుంచి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ వైదొలగాలంటూ.. ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వేసిన పిటిషన్‌ పై తీర్పు చెబుతూ.. అనేక వ్యాఖ్యలు చేశారు.

న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా, సచ్ఛీలంగా, నిజాయతీగా, పక్షపాతరహితంగా ఉండాలన్న భావనకు కొంత విఘాతం కలగడానికి మేం కూడా కొంత కారణమేనంటూ జస్టిస్ రాకేశ్ కుమార్ కామెంట్ చేశారు.  చాలా సందర్భాల్లో న్యాయమూర్తులుగా పదవీవిరమణ చేసిన వెంటనే వారికి వేరే పోస్టు లభిస్తోందని... కనీసం ఏడాది పాటైనా అలాంటి పదవులేమీ తీసుకోకుండా మేం సంయమనం పాటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు మమ్మల్ని ఎవరూ ప్రభావితం చేయలేరని జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ అంటున్నారు.

మరి జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి.. న్యాయమూర్తులు కూడా తమ పదవీవిరమణ తర్వాత వచ్చే పదవుల కోసం తీర్పులు తప్పుగా చెబుతున్నారనేగా.. వారు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారనే కదా.. ఇలా ఓ జడ్డి ఏకంగా తన తీర్పులోనే అంగీకరించడం చాలా అరుదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: