ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే ఈయనకు చెక్ పెట్టాలని టీడీపీ ఎప్పటి నుంచో చూస్తుంది. కానీ అది సాధ్యపడటం లేదు. అంత బలం ఉన్న టీడీపీకే కొడాలికి చెక్ పెట్టడం సాధ్యం కావడం లేదు. పెద్దగా బలం లేని జనసేన కొడాలికి ఎలాగైనా చెక్ పెట్టాలని కలలు కంటుంది.
ఇటీవలే పవన్ గుడివాడలో పర్యటించి కొడాలిపై ఎలాంటి విమర్శలు చేశారో తెలిసిందే. పవన్ వచ్చి వెళ్ళాక, గుడివాడలో కొంత జనసేన కేడర్ యాక్టివ్ అయ్యింది. నెక్స్ట్ ఎన్నికల్లో గుడివాడలో జనసేన తరుపున బలమైన నేతని పెట్టాలని చూస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు గుస గుసలాడుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో గుడివాడలో జనసేన అసలు పోటీ చేసిందో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ సారి అలా ఉండకూడదని జనసేన అధిష్టానం భావిస్తోందంట.
ఒకవేళ టీడీపీతో గానీ పొత్తులోకి వెళితే కొడాలికి సులువుగా చెక్ పెట్టొచ్చని మరికొందరు జనసైనికులు భావిస్తున్నారట. కానీ ఎవరు ఎలా పోటీ చేసినా గుడివాడలో కొడాలిని ఓడించడం సాధ్యపడదని తెలుస్తోంది. ఎందుకంటే 2014లో టీడీపీ-బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తేనే కొడాలిని ఓడించలేకపోయారు. ఇక 2019 ఎన్నికల్లో ఫలితం ఏంటో చెప్పాల్సిన పనిలేదు. అసలు ఇక్కడ కేవలం వైసీపీని అభిమానించే వారే కాదు, ఇతర పార్టీల్లో కూడా కొందరు కొడాలికి వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు. కాబట్టి గుడివాడలో కొడాలికి షాక్ ఇవ్వడం ఏ పార్టీకి సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి