పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా రోజురోజుకూ దిగజారిపోతోంది. అసలు ఏ దేశ ప్రధాని వస్తున్నా.. ఆ దేశ ప్రధాని వంటి వారు స్వాగతం పలుకుతారు..కానీ ఇప్పుడు పాక్ ప్రధానికి ఆ దేశ రాయబారులే స్వాగతం పలుకుతున్న పరిస్థితి. తాజాగా మరీ దారుణమైన  ఘటన జరిగింది. అదేంటంటే.. పాక్‌ ఎయిర్‌ లైన్‌ సంస్థకు గతంలో మలేసియా ప్రభుత్వం రుణం ఇచ్చింది. ఆ రుణంపైనే పాక్ ఎయిర్‌ లైన్స్ కొన్ని విమానాలు కొనుగోలు చేసింది.

అయితే అప్పు ఇచ్చి చాన్నాళ్లయినా.. పాక్ ఆ అప్పు తిరిగి ఇవ్వలేదట. దీంతో చిర్రెత్తుకొచ్చిన మలేసియా సర్కారు.. మలేసియాకు వచ్చిన పాక్‌ ఎయిర్ లైన్స్ విమానాన్ని అక్కడే జప్తు చేసేసిందట. అప్పు తీర్చాకే విమానం తీసుకెళ్లమని ఘాటుగా చెప్పేసిందట. ఇలా ఓ దేశం విమానాన్ని మరో దేశం తన దేశంలోనే జప్తు చేసుకోవడం చాలా అవమానకరం. రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు తలెత్తడం చాలా దారుణమని పాక్ నాయకులే చెబుతున్నారు.

గతంలోనూ పాక్ కు ఇలాంటి అవమానం ఎదురైంది. ఆ మధ్య ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..  ఐరాసలో మాట్లాడాక.. అమెరికా నుంచి తిరిగొచ్చే సమయంలో.. ఆయన ప్రయాణించిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వెనక్కి వెళ్లిన ఇమ్రాన్ మరో విమానంలో ఇస్లామాబాద్ తిరిగొచ్చారని వార్తలొచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్లడానికి ముందు రియాద్ వెళ్లి.. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ను కలిశారు. పాకిస్థాన్ ప్రధాని అమెరికా పర్యటన కోసం ఇమ్రాన్ ఖాన్ వారం రోజులపాటు తన విమానాన్ని ఇచ్చేశారు. కానీ ఇమ్రాన్ ఖాన్ న్యూయార్క్‌లో చేసిన వ్యాఖ్యలు సౌదీ యువరాజుకు నచ్చలేదట. దీంతో తన విమానాన్ని వెనక్కి ఇవ్వాలని సౌదీ రాజు ఇమ్రాన్‌ను ఆదేశించారట.


విమానం గాల్లోకి ఎగిరినప్పటికీ.. సాంకేతిక కారణాలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్.. తిరిగి అమెరికాలో ల్యాండయ్యారు. మరో విమానంలో ఇస్లామాబాద్ చేరుకున్నారు. అప్పట్లో ఆ వార్తలతో ఇమ్రాన్ ఖాన్ పరువు పోతుండటంతో.. తూచ్.. ఇదంతా తప్పుడు కథనం అని పాకిస్థాన్ కొట్టిపడేసింది. సౌదీతో మా సంబంధాలు బలంగా ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ కథనం రాసుకొచ్చారని పాక్ అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: