సమాజంలో రోజురోజుకు మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు మర్చిపోయి అక్రమసంబంధాలలో మునిగి తేలుతున్నారు. ఇక పినతల్లి భార్యగా మారి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన రష్యాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్ యేన్సార్ మరీనా బల్మాషేవా పదేళ్ల కిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది. అర్రేకు అప్పటికే పదేళ్ల కొడుకు ఉన్నాడు. మరీనా కూడా అతడిని కన్న కొడుకులా ఎంతో ప్రేమగా చూసుకొనేది. అయితే, కొన్ని నెలల కిందట అర్రేతో స్పర్థలు ఏర్పడటంతో మరీనా అతడికి విడాకులిచ్చింది.

ఇక ఆమె ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. అయితే, పదేళ్లపాటు ఆమెతోపాటు పెరిగిన కొడుకు వ్లాడిమిర్ మరీనాను వదిలి ఉండలేకపోయాడు. పైగా వ్లాడిమిర్‌కు 20 ఏళ్లు దాటాయి. మరీనా తన తండ్రికి విడాకులిచ్చి వదిలేసినా వ్లాడిమిర్ మాత్రం ఆమెను దూరం చేసుకోలేదు. నిత్యం ఆమెను కలుస్తూనే ఉండేవాడు. దీంతో వారి మధ్య ఉన్నది తల్లి-కొడుకుల బంధం కాదని, దానికి మించినదని మరీనా భావించింది. ఆమె తన మనసులో మాటను వ్లాడిమిర్‌కు చెప్పింది. ఇందుకు అతడు కూడా అంగీకరించాడు. తమ ప్రేమను పెళ్లితో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఈ వార్త విని ఆమె మాజీ భర్తకు గుండె ఆగినంత పనైంది. తనతో కాపురం చేసి అన్ని సుఖాలు పొందిన మాజీ భార్య తనకు కోడలిగా తిరిగి వస్తుందని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. కానీ, కొడుకు ఇష్టాన్ని కాదనలేక అయిష్టంతోనే వారి నిర్ణయాన్ని పెద్ద మనస్సుతో స్వాగతించాడు. దీంతో ఇద్దరు చట్టబద్దంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా వ్లాడిమిర్ ఒక్క నెలలోనే ఆమెను గర్భవతిని చేశాడు. ఇప్పుడు ఆమెకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మరీనాకు సాధారణమైన మహిళ కాదు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సుర్‌గా ఆమెకు 5,60,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: