షేర్ మార్కెట్.. చాలా మందికి అర్థం కాని సబ్జక్ట్.. కానీ.. ఇష్టపడి నేర్చుకుంటే..అది కాసులు కురిపించే ఓ ప్రక్రియ.. కానీ అదంత సులభం కాదు... ఒక్కరోజులోనో.. ఒక్క నెలలోనో వచ్చేది కాదు.. దీనికి దీర్ఘకాలికమైన శ్రమ, ఓపిక, విశ్లేషణ సామర్థ్యం అవసరం.. పత్రికల్లో వచ్చే వార్తలు ఫాలో కావాలి.. ఏ పరిణామం.. ఈ స్టాక్‌ ను ప్రభావితం చేస్తుందో అంచనా వేయగలగాలి.. ఇప్పుడు ఇలాంటి వారికి చాలా గిరాకీ ఉంది.


అయితే.. ఈ స్టాక్ మార్కెట్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది..ఓ 64 ఏళ్ల బామ్మ.. ఆమె పేరు భాగ్యశ్రీపాఠక్‌. అవును.. హాయిగా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే వయస్సులో ఆమె స్టాక్ మార్కెట్‌ను అధ్యయనం చేసి అద్భుతమైన సలహాలు ఇస్తున్నారు. ఆమె ఉదయం పూట వంట చేస్తూనే టీవీలో వచ్చే అంతర్జాతీయ న్యూస్‌ను ఫాలో అవుతారు. అవి విన్న తర్వాతే ఆమె యూట్యూబ్‌లో షేర్‌మార్కెట్‌, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ గురించి అద్భుతమైన పాఠాలు చెబుతారు.


తన మొబైల్ నుంచే  షేర్‌మార్కెట్‌ గురించి అనర్గళంగా మాట్లాడుతూ యువతకు ట్రేడింగ్‌లో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈమె యూట్యూబ్‌ ఛానల్‌కు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. భాగ్యశ్రీపాఠక్‌ సొంతూరు ముంబయి. ఈమె కూడా మొదట్లో ఉద్యోగం చేసేది. ఆ తర్వాత పిల్లల కోసం వదిలేశారు. పిల్లలు కాస్త పెద్దయ్యాక ఆమెకు షేర్‌ మార్కెట్‌పై ఆసక్తి పెరిగింది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఆన్‌లైన్‌ సదుపాయం లేవు కదా.


అందుకే నేరుగా ఆఫీసులకెళ్లి ట్రేడింగ్‌ మెలకువలు నేర్చుకున్నారు. మొదట్లో ఇలా షేర్‌మార్కెట్‌ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన భాగ్యశ్రీని చూసి మగవాళ్లంతా ఆశ్చర్యపోయేవారట. ఈమె వల్ల ఏమవుతుంది అని వెటకారం చేసేవారట. కానీ భాగ్యశ్రీ మాత్రం పట్టుదలతో షేర్‌మార్కెట్‌పై పట్టు సాధించారు. సొంతంగా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ అనుభవంతోనే ఇప్పుడు యూట్యూబ్‌ సాయంతో నెటిజన్లకు ఆన్ లైన్‌లో సలహాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: