తెలంగాణలో
బిజెపి ఎంపీ ధర్మపురి
అరవింద్ ఈ మధ్య కాలంలో కాస్త ప్రజలు బలంగా వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ధర్మపురి
అరవింద్ ద్వారా రథయాత్ర చేయించే ఆలోచనలో
భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారని అంటున్నారు. ఇటీవల బండి సంజయ్ చేసే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరిగింది. దీనికి సంబంధించి స్పష్టత లేకపోయినా సరే త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేయనుంది
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం.
ధర్మపురి
అరవింద్ రథయాత్ర చేస్తే బండి సంజయ్ పాదయాత్ర చేయాలని... ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అని
భారతీయ జనతా పార్టీ నేతలు భావిస్తున్నారు. ధర్మపురి
అరవింద్ రథయాత్ర చేసిన తర్వాత
కేంద్ర మంత్రివర్గంలో కూడా తీసుకునే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు.
కేంద్ర రైల్వే శాఖ సహాయ
మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కర్ణాటకకు చెందిన ఒక
రాజ్యసభ ఎంపీ మరణించడంతో ఆ శాఖలోకి ఆహ్వానించే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేంద్ర క్యాబినెట్ నుంచి కిషన్ రెడ్డిని తప్పించి ధర్మపురి
అరవింద్ తీసుకుంటే బాగుంటుంది అనే భావనలో
కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఉన్నాయని సమాచారం.
అయితే
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ యాత్రకు సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా సరే వచ్చేవారం
బిజెపి రాష్ట్ర నాయకత్వం సమావేశం నిర్వహించిన తర్వాత ప్రకటన చేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ధర్మపురి
అరవింద్ సీఎం
కేసీఆర్ విషయంలో దూకుడుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో కూడా ఆయన చేసే విమర్శలు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పాలి. దీంతో
టీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి భవిష్యత్తులో ధర్మపురి
అరవింద్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు ఏంటి అనేది చూడాలి.