పార్టీలో విజయవాడ కేంద్రంగా ఏం జరగాలన్నా.. అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగేలా చక్రం తిప్పారు. సామాజిక వర్గం కలవడం.. కూడా చంద్రబాబుతో కేశినేని బంధాన్ని ద్రుఢం చేసింది. అయితే.. ఇప్పుడు ఇదంతా చరిత్రగా మిగులుతుందా? మున్ముందు మరింత సంచలనంగా మారుతుందా? అనేది తాజా ఎన్నికల్లో గెలుపుతోనే సాధ్యం కానుంది. ఒకవేళ విజయవాడలో కనుక వైసీపీ విజయం సాధిస్తే.. టీడీపీ ఖాతాలోకి ఈ పరాజయం పడుతుందని భావించినా.. వ్యక్తిగతంగా కేశినేని రాజకీయంగా భారీ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
బహుశ.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అవసరమైతే.. రేపు పార్టీ మారిపోతారు అన్నారు. ఇప్పుడు విజయవాడలో కనుక టీడీపీ విజయం సాధించకపోతే.. కండువా మార్చేయడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఇప్పటికే ఆయన ఒంటరిగా మారిపోయారు. విజయవాడ నేతలు.. ఇటీవల మూకుమ్మడిగా ఆయన పై దాడి చేశారు. ఇక, గెలుపు గుర్రం ఎక్కకపోతే.. ఈ దాడి మరింత తీవ్రంగా మారడంతోపాటు.. కేశినేని పూర్తిగా డమ్మీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. గెలిస్తే.. మాత్రం మరింత దూకుడు పెంచడమూ ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి