కేర‌ళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న పిన‌ర‌యి విజ‌య‌న్ నేతృ త్వంలోని ఎల్డీఎఫ్ స‌ర్కారే తిరిగి అధికారం చేప‌డుతుంద‌ని స‌ర్వేలు చాటుతున్నాయి. అదేస‌మ‌యంలో బీజేపీ కూడా ఇక్క‌డ బ‌ల‌ప‌డుతుంద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పిన‌ర‌యి విజ‌యన్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ నేత‌లు, మిత్ర‌ప‌క్షాల నాయ‌కుల‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉన్నారు.. విజ‌యంపై ధీమా వ‌ద్ద‌ని.. ప‌ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని ఆయ‌న చెబుతున్నారు.. ఈ క్ర‌మంలో పిన‌ర‌యి విజ‌య‌న్‌కు క‌లిసి వ‌స్తున్న అంశాలు ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

అవినీతి ర‌హితం..
కేర‌ళ‌లో ఎక్కువ మంది విద్యావంతులు. ఇక్క‌డ ప్ర‌జ‌ల్లోనే అవినీతి అంటే తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఏ ఒక్క విష‌యంలోనూ వారు అవినీతిని స‌హించ‌రు. ఇక‌, ప్ర‌బుత్వం ప‌రంగా చూస్తే.. అవినీతి ర‌హిత పాల‌న అం దించ‌డంలో పిన‌ర‌యి.. ముందున్నారు. ఇటీవ‌ల త‌న కేబినెట్ మంత్రిపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ‌ప్పుడు ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి... వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించారు.. అదేస‌మ‌యంలో స‌ద ‌రు మంత్రిని కేబినెట్ నుంచి తొల‌గించి.. ప్ర‌జ‌ల్లోకి మంచి సందేశాలు పంపించారు.. ఇప్పుడు ఈ ప‌రిణామం.. పిన‌ర‌యికి క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు..

క‌రోనా నియంత్ర‌ణ‌..
దేశంలో క‌క‌రోనా కేసులు వెలుగు చూసింది తొలుత కేర‌ళ‌లోనే.. దీంతో పిన‌ర‌యి విజ‌యన్ ప్ర‌భుత్వం వెంట‌నే యుద్ధ ప్రాతిప‌దిక‌న తీసుకున్న చ‌ర్య‌ల కార‌ణంగా కేసుల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించారు. ఇక‌, ప్ర‌జా క్షేమం కోసం.. త‌ర‌త‌మ భేదాలు లేకుండా ఆర్థిక ప‌ర‌మైన వ్య‌త్యాసం కూడా చూప‌కుండానే ఇంటింటికీ నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు. అదేస‌మ‌యంలో పేద‌ల కుటుంబాల‌కు 4 వేల చొప్పున పంపిణీ చేశారు. ఇది ఇప్పుడు ఆయ‌న విజ‌యానికి మ‌రో రీజ‌న్‌గా మారింది.

ఉద్యోగ‌/  ఉపాధి క‌ల్ప‌న‌
దేశంలో ఉద్యోగ‌, ఉపాధి క‌ల్ప‌న‌లో ముందున్న రాష్ట్రంగా కేర‌ళ నిలిచింది. విద్యావంతుల‌కు ఉద్యోగాలు, సాధార‌ణంగా చ‌దువుకున్న వారిక‌కి ఉపాధి క‌ల్ప‌న‌తోనూ విజ‌యన్ సంతృప్తి ప‌రిచారు. ఫ‌లితంగా ఇది కూడా ఆయ‌న మ‌రోసారి సీఎం పీఠం అధిరోహించేందుకు ఆస్కారం ఏర్ప‌డింది.

మ‌త రాజ‌కీయాల‌కు దూరం!
కేర‌ళ‌లో మ‌త రాజ‌కీయాల‌కు ప్ర‌భుత్వం ప‌రంగా విజ‌య‌న్ దూరంగా ఉన్నారు.. మ‌రోవైపు బీజేపీ మాత్రం అయ్య‌ప్ప స్వామి ఆల‌యం కేంద్రం గా మ‌త రాజ‌కీయాల‌కు ప్ర‌య‌త్నాలు చేసింది. ఇది బెడిసి కొట్టింది. దీంతో విజ‌య‌న్ అయితే.. బాగుంటుంద‌నే ఆలోచ‌న ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌నిపిస్తోంది. అయితే.. ఈ ద‌ఫా.. కొంత మేర‌కు బీజేపీ ప‌ట్టు పెంచుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఏదేమైనా.. విజ‌యన్ రెండో సారి కూడా అధికారంలోకి వ‌చ్చేందుకు ఆయ‌న పాల‌నే గీటు రాయిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: