దీనికితోడు తిరుపతి ఉపఎన్నిక ద్వారా ఎలాగైనా ఏపీలో బలం పెంచుకోవాలి బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. అందుకే జనసేనను ఒప్పించి మరీ ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోంది. పట్టుబట్టి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను పోటీలో నిలిపింది. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవకపోయినా సెకండ్ ప్లేస్ కొట్టేసి ఏపీలో సత్తా చాటాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు టీడీపీలోని వర్గ విబేధాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైనా ఆ పార్టీ నేతలు ఇంకా తమలో తామే కొట్టుకుంటూ అనైక్యత ప్రదర్శిస్తున్నారు.
గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీకి ద్రోహం చేసిన ఆ పార్టీ నేతలు బయటకు వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మరో నేత మబ్బు దేవ నారాయణ రెడ్డి తాజాగా డిమాండ్ చేయడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కొందరు టీడీపీ నేతలు వైసీపీకి భయపడి ఈ విధంగా చేశారని వారు అంటున్నారు. అలాంటి వారు పార్టీకి అవసరం లేదని విమర్శించారు. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో అయినా వేరే పార్టీకి సహకరించి టీడీపీకి ద్రోహం చేయకుండా ఉండాలంటున్నారు.
మరి మున్సిపల్ ఎన్నికల్లోనే గ్రూపులు ప్రదర్శించిన వారు పార్లమెంటు ఉప ఎన్నికలో మాత్రం కలసికట్టుగా ఉంటారా అన్నది అనుమానమే. మొత్తం మీద ఈ కుమ్ములాటలు బీజేపీకి కలసి వస్తాయా అన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఏపీలో టీడీపీ పరువు పాతాళానికి జారి పోవడం ఖాయం. మరి చంద్రబాబు ఈ గండం నుంచి పార్టీని ఎలా గట్టెక్కిస్తారో..!?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి