ఇలాంటి సమయంలో కరోనాను అరికట్టేందుకు మరో మందు రెడీ అవుతోందన్న వార్త సంతోషం కలిగిస్తోంది. కరోనాకు చికిత్స చేయడం కోసం మరో ఔషధాన్ని అందుబాటులోకి తెస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇన్‌ఫ్లూయెంజాను నయం చేయడానికి గతంలో అభివృద్ధి చేసిన ఒక మందుకు కరోనా వైరస్ తీవ్రతను కట్టడి చేసే సామర్థ్యం ఉందని వారు చెబుతున్నారు. ఈ మందు గురించి సైంటిస్టులు ఇప్పటికే ఎలుకలపై ప్రయోగం చేశారు. అవి విజయవంతమయ్యాయట.
మానవులపైనా క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయని.. అవి తుది దశలో ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఔషధం ఏంటంటే.. మోల్నుపిరావిర్. ఈ మందుపై అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ , బ్రిటన్‌లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కరోనా వల్ల బాధితుల ఊపిరితిత్తుల్లో కలిగే నష్టాన్ని కూడా ఈ మోల్నుపిరావర్ తగ్గిస్తుందట. ఒక విధంగా ఇది రెమెడిసివిర్ లాంటిదే.
రెమిడిసివిర్ ను ఇంజక్షన్ రూపంలో ఇస్తున్నారు. ఈ మోల్నుపిరావిర్ ను మాత్రం మాత్రలు రూపంలో తీసుకోవచ్చు. అందువల్ల దీన్ని ఎవరైనా సులభంగా వాడొచ్చు. ఇంజక్షన్ అయితే ఆస్పత్రికి వెళ్లాలి. లేదా డాక్టర్, నర్సును ఇంటికి రప్పించుకోవాలి. కానీ మాత్ర అయితే ఎవరైనా వేసుకోవచ్చు కదా. ఇప్పటికే ఎలుకలపై బాగా పని చేసిన ఈ మందుకి మానవుల్లో వ్యాప్తిలో ఉన్న ఇతర కరోనా వైరస్‌లు, మెర్స్, సార్స్ వంటి వైరస్‌ల పునరుత్పత్తిని అడ్డుకునే సామర్థ్యం ఉందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి