గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. చూస్తూ చూస్తుండగానే  వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమం లోనే రోజు రోజుకూ పరిస్థితిలు చేయి దాటి పోయే లా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తోంది ముఖ్యంగా కరోనా వైరస్ కి కారకులుగా ఉన్న వారిని గుర్తించి ఐసోలేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం.  ఈ క్రమంలోనే ప్రస్తుతం కరోనా వైరస్ రోగులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.



 అయితే ఓ వైపు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికీ ప్రజలందరూ మాత్రం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఎంతో మంది కరోనా వైరస్ రావడానికి కారకులుగా మారిపోతున్నారు.  అయితే  ఇటీవలే ఉత్తరాఖండ్లో కుంభ మేళా జరిగింది ఈ కుంభ మేళాలో  వైరస్ నిబంధనలను ఉల్లంఘించి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  ఇక తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది ఈ కుంభమేళ లో పాల్గొన్నారు. అయితే ఇటీవలే ఉత్తరఖండ్ లో ముగిసిన కుంభమేళా లో పాల్గొన్న వారు హోమ్ క్వారంటైన్ లో  ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు.



 ఇటీవలే  ఉత్తరాఖండ్ లో ముగిసిన కుంభమేళా లో పాల్గొన్న కొంత మందికి కరుణ వైరస్ సోకినట్లు గుర్తించారు ఈ నేపథ్యం లోనే స్పందించిన ఆయన 14 రోజుల పాటు కుటుంబాలకు దూరంగా ఉండాలని ఇక ఇంట్లో ఉన్నా కూడా మాస్కు తప్పని సరిగా ధరించాలి అంటూ సూచిస్తున్నారు.దగ్గు జ్వరం గొంతు నొప్పి ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే టెస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు డైరెక్టర్ శ్రీనివాసరావు. ఇక ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి వెంటనే ఫోన్ 104 నెంబర్ కి కాల్ చేయాలి అని ఆయన సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: