కళ్లెదుటే నిండు ప్రాణం కుప్పకూలిపోయిన కనీసం చేయి అందించడం లేదు నేటి రోజుల్లో ఎవరు. ప్రాణాలు పోతున్నాయని దయ చూపి సహాయం చేయాలి అంటూ కాళ్ళు పట్టుకుని వేడుకున్న కనీసం కనికరం చూపడం లేదు చుట్టుపక్కల జనాలు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో సదరు వ్యక్తి భార్య కుమారులతో కలిసి ఆస్పత్రికి వెళుతున్నాడు. సరిగ్గా ఆసుపత్రికి చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక అచేతన స్థితిలో తన భర్త ప్రాణాలతో ఉన్నాడా లేదా అన్నది కూడా ఆమెకు తెలియడం లేదు అరణ్యరోదనగా భర్త పక్కనే కూర్చుని ఏడుస్తుంది.
నాన్న ఒక్కసారిగా పడిపోయాడు.. కాస్త సాయం చేయండి సార్.. అంటూ అతని కొడుకు అక్కడున్న వారందరినీ ఎంతగానో వేడుకున్నాడు. కానీ అక్కడ ఎవరి గుండె కరగలేదు సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో చివరికి అతని ప్రాణాలు వదిలాడు. ఘటన కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎండపల్లి గ్రామానికి చెందిన చంద్ర రావు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవలే వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లాడు ఈక్రమంలోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే భర్తకు ఏమైందో తెలియక ఇక భర్త వద్ద కూర్చుని విలపించింది భార్య. సహాయం చేయాలని కొడుకు ఎంతోమంది వేడుకున్నాడు కానీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సహాయం కోసం ఎదురు చూసిన ఎవరు ముందుకు రాలేదు చివరికి అతను ప్రాణాలు కోల్పోవడంతో ప్రైవేట్ అంబులెన్స్లో ఇంటికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి