రాజకీయాలలో ప్రజల మనసులు గెలిచిన రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న కరుణానిధి తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టాలిన్ ఇక మొదటి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ఎంతో దూకుడు గాని కొనసాగిస్తూ వస్తున్నారు. 1996 నుంచి 2002 వరకు కూడా చెన్నైకి మేయర్గా పనిచేశారు స్టాలిన్. ఇక ఆ తర్వాత మొదటి సారి 2009 నుంచి 2011 వరకు ఉప ముఖ్య మంత్రిగా పని చేశారు. ఇక ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో గ్రామీణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఇక తండ్రి కరుణానిధి మరణం తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు చేపట్టాడు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయలేదు స్టాలిన్.
ఇక 10 సంవత్సరాల నుంచి అధికారానికి దూరం గా ఉన్న డీఎంకే పార్టీ ని ఎంతో వ్యూహాత్మకం గా ముందుకు నడిపించి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించాడు. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అనే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఏకంగా 159 స్థానాల్లో విజయఢంకా మోగించి ఇక తిరుగులేని విజయాన్ని నమోదు చేసి అన్నాడీఎంకే పార్టీకి షాక్ ఇచ్చారు. ఇక మొదటి సారి తమిళనాడు ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి