కరోనా విపరీతంగా విజ్రుంభిస్తుంది.దేశంలో కరోనా వైరస్ రెండో దశ విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకి కరోనా ఉధృతి చాలా తీవ్రంగా మారుతుంది.రోజువారీ కొవిడ్ కేసులు 4లక్షలకు చేరువగా, మరణాలు 5వేలుగా నమోదవుతూ, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 40 లక్షలకు చేరువయ్యాయి.ఇది చాలా ప్రమాదకరంగా సాగుతూ, వేలమందిని పొట్టనపెట్టుకుంటుండగా, వ్యాక్సిన్ల కొరత వల్ల టీకాల పంపిణీ కార్యక్రమం డీలాపడింది. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి ఉండటంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం దృష్ట్యా అందరికీ టీకాలు అందాలంటే ఇక కొన్ని ఏళ్లు పడుతుంది.ఇప్పటికే భారత్ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ లను శర వేగంగా ఉత్పత్తి చేయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా మే1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టినప్పటికీ టీకాల కొరత కారణంగా అది సజావుగా సాగడం లేదు.


ప్రస్తుతానికి కేంద్రం.. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్, సీరం తయారీ కొవిషీల్డ్ తోపాటు రష్యా వారి స్ఫుత్నిక్-వి వ్యాక్సిన్లకు మాత్రమే భారత్ లో అనుమతిచ్చింది. దేశంలో తయారయ్యే కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం అవసరాలకు సరిపడినంతగా లేకపోవడంతో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది.  ఇక ఈ దశలో వ్యాక్సిన్ల ఉత్పత్తిపై  కేంద్ర ప్రభుత్వం పాజిటివ్ వార్తని వెల్లడించింది. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ల ఉత్పత్తి కోసం దేశంలో 9 కంపెనిలకు అప్రూవల్ ఇచ్చింది. డిసెంబర్ నాటికి దాదాపు 261 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు ఉత్పత్తి చెయ్యాలని మోడీ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇప్పటికే కొంతమంది వ్యాక్సిన్ లు తీసుకుంటున్నారు. ఇక డిసెంబర్ నాటికి ఇంకా తీసుకొని వారు 90 శాతం నుంచి 100 శాతం రికవరీ కేసులు అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక డిసెంబర్ నాటికి పూర్తిగా ప్రజలు కరోనా మహమ్మారి నుంచి రికవరీ అయ్యేలా చేస్తామని మోడీ గవెర్నమెంట్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: